హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు ఓటమి భయం: రోశయ్య

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఓటమి పాలవుతామనే భయంతోనే తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. రాష్ట్రానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబుకు 2009 ఎన్నికల్లో ఓటమి అనంతరం అసహనం ఎక్కువైందని అన్నారు. గనులపై ఆరోపణలు వస్తే వాటిని కప్పిబుచ్చేస్థితికి తాను రాలేదని ఆయనన్నారు. తనను అదిరిస్తే, బెదిరిస్తే రాజీనామా చేస్తాననుకోవడం ప్రతిపక్షనాయకుడి అవివేకమన్నారు. 2009 ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.

ఓబుళాపురం గనుల వ్యవహారంపై ఆరోపణలు వచ్చిన తర్వాత తానే సీబీఐ విచారణకు ఆదేశించినట్టు రోశయ్య తెలిపారు. తనను గాలి జనార్దనరెడ్డి జీతగాడుగా అభివర్ణించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జీతగాడుగా పనిచేస్తే ఓబుళాపురం గనులపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశిస్తానని ఆయన ప్రశ్నించారు. బాబు పాలనపై అప్పట్లో భాజపా... తదితర రాజకీయపక్షాలు చేసిన విమర్శలను ఆయన ప్రస్తావించారు. అవినీతిపై చర్చకు ఎప్పుడూ సిద్దమేనని ఆయన అన్నారు. 1951నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని సామాన్య కార్యకర్తగా రాజకీయాల్లో ఎదిగానే తప్ప ఇతర మార్గాల ద్వారాతాను అధికారంలోకి రాలేదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X