వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రచయిత్రి కుప్పిలి పద్మకు చాసో పురస్కారం

By Santaram
|
Google Oneindia TeluguNews

Vizayanagaram
విజయనగరం: ప్రతిష్టాత్మకమైన చాగంటి సోమయాజులు (చాసో) స్ఫూర్తి 16వ సాహితీ పురస్కారాన్ని ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మకు అందజేయనున్నట్లు చాసో సాహిత్య ట్రస్టు వ్యవస్థాపకరాలు చాగంటి తులసి ప్రకటించారు. చాసో 95వ జయంతి సందర్భంగా జనవరి 17వ తేదీన ఈ పురస్కారాన్ని అందజేస్తామని తెలిపారు. విజయనగరంలోని తన స్వగృహంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో చాగంటి తులసి మాట్లాడారు.

ఈనాటి యువ రచయిత్రిలు చాసో స్ఫూర్తితో రచనలు చేయాలనే ఉద్దేశంతో 1995 జనవరి 17వ తేదీ నుంచి చాసో స్ఫూర్తి పురస్కారాన్ని అందజేస్తున్నామని చెప్పారు. విశాఖపట్నంలో జన్మించి, హైదరాబాద్‌లో ఉంటున్న కుప్పిలి పద్మ ప్రస్తుతం ఓవర్సీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీలో క్రియేటివ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారని తెలిపారు. అమృత వర్షిణి అనే పుస్తక ప్రచురణతో ఆమె పాఠకుల ముందుకు వచ్చారని చెప్పారు. రచనల్లో సంభాషణలను క్లుప్తంగా, సూటిగా, పదునుగా, కళాత్మకంగా, వ్యంగ్యపూరితంగా చెప్పడం ఆమె ప్రత్యేకతని తెలిపారు.

క«థా ప్రక్రియలోనే కాక కాలమిస్టుగా, క్రియేటివ్‌ రచయిత్రిగా పేరు తెచ్చుకున్నారన్నారు. జనవరి 17న విజయనగరంలోని లేడీస్‌ రిక్రియేషన్‌ క్లబ్‌లో జరిగే కార్యక్రమంలో చాసో స్ఫూర్తి అవార్డు కింద పదివేల రూపాయలు నగదు, శాలువ, జ్ఞాపికలను అందజేస్తామని తెలిపారు. ఈ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రిటైర్డు ప్రొఫెసర్‌ ఆచార్య ఎస్‌.గంగప్ప, కవి, విమర్శకులు, కథకుడు, భాషాపండితుడు ఇంద్రగంటి శ్రీకాంత్‌శర్మ, కథకుడు తుమ్మలరామకృష్ణ పాల్గొనున్నారని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X