విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కృష్ణాలో గాలిదుమారానికి నేలరాలిన మామిడి

By Santaram
|
Google Oneindia TeluguNews

Krishna Dist
విజయవాడ: కృష్ణాజిల్లా వ్యాప్తంగా బుధవారం సాయంత్రం బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా మామిడి రైతులకు భారీ నష్టం సంభవించింది. పశ్చిమ కృష్ణాలో మామిడి నేల రాలింది. తూర్పు కృష్ణాలోని వేలాది ఎకరాల్లో చేతికొచ్చిన వరిపంట తడిసి ముద్దయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచి భానుడు తన ప్రతాపం చూపాడు. జిల్లాలో పలుచోట్ల 42 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సాయంత్రం అయ్యే సరికి ఒక్కసారిగా మబ్బులు కమ్ముకువచ్చాయి.

చాట్రాయి, విస్సన్నపేట, నూజివీడు, హనుమాన్‌జంక్షన్‌, తిరువూరు, మైలవరం, గన్నవరం, బాపులపాడు, నందిగామ, వీరులపాడు, జగ్గయ్యపేట, కైకలూరు, గుడివాడ, మచిలీపట్నం, దివిసీమ ప్రాంతాలను గాలి దుమారం చుట్టుముట్టింది. జనజీవనం స్తంభించిపోయింది. ఈ ఏడాది కాపు తక్కువగా ఉండటంతో మామిడి మంచి ధర పలుకుతున్న దశలో గాలి దుమారం రావడంతో భారీగా దెబ్బతిన్నామని రైతులు వాపోతున్నారు. గురువారానికి గాని ఎంత నష్టం జరిగిందో తెలియదని అధికారులు చెబుతున్నారు. వేలాది ఎకరాల్లో పొట్టదశకు వచ్చిన వరి పైరు గాలికి నేలకొరిగింది. దీనికితోడు కురిసిన వర్షానికి పంట నష్టం పెద్ద ఎత్తున జరిగి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X