యుపిఎ ప్రభుత్వం ప్రజల రక్తం తాగుతోంది: చంద్రబాబు

By:
Subscribe to Oneindia Telugu

Chandrababu Naidu
హైదరాబాద్‌: పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచి కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం ప్రజల రక్తం తాగుతోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ఆయన సోమవారం బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ వద్ద ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని ఆయన అన్నారు. అన్ని రాష్ట్రాల్లో కన్నా మన రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆయన విమర్శించారు. పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించే వరకు ఉద్యమాన్ని సాగిస్తామని ఆయన చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని ఆయన హెచ్చరించారు.

పేదల పట్ల కాంగ్రెసు ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ప్రజల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. బెల్టు షాపులపై తిరగబడాలని ఆయన మహిళలకు పిలుపునిచ్చారు. అలా తిరగబడే మహిళలకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన చెప్పారు. ప్రజల ఆదాయం పెరిగి వారి కొనుగోలు శక్తి పెరిగిందనే మంత్రుల మాటలను ఆయన వ్యతిరేకించారు. పేదల కొనుగోలు శక్తి పెరగలేదని, మంత్రులు అవినీతి పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రుల అవినీతి ఆదాయం పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాదులోని అమీర్ పేటలో ధర్నా చేస్తూ అరెస్టయిన చంద్రబాబు వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలయ్యారు.

Please Wait while comments are loading...