వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ బిల్లు ఈసారి పార్లమెంటులో ఉండదు: కేంద్ర మంత్రి బన్సాల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Pawan Kumar Bansal
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపాదించడం లేదని కేంద్ర మంత్రి పవన్ కుమార్ బన్సాల్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రతిపాదించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులతో పాటు తెలుగుదేశం, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు కూడా కోరుతున్నారు. బిల్లు ప్రతిపాదించాలంటూ కాంగ్రెసు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇదే విషయంపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు గత కొద్ది రోజులుగా ఢిల్లీలో మకాం వేసి కాంగ్రెసు కోర్ కమిటీ సభ్యులను కోరుతున్నారు. అయినా ఫలితం లేకుండా పోయింది.

కాగా, బిల్లును ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంతంలో సహాయ నిరాకరణ ఉద్యమం సాగుతోంది. గురువారం ప్రారంభమైన శానససభలో తెలంగాణ అంశంపై తీవ్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ అంశంపై శాసనసభ శుక్రవారం కూడా దద్ధరిల్లింది. ఈ స్థితిలో ఏం చేయాలనే డైలమాలో కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు పడ్డారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ అంశం ఏ విధంగా ప్రతిబింబిస్తుందనేది కూడా ఆసక్తికరంగానే మారింది.

English summary
Union Minister stated that Telangana bill not be proposed in present Parliament Budget session. With this Congress leaders from Telangana are worried about the future coarse of action.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X