పద్మనాభ స్వామి ఆరో గదిపై బుధవారం దాకా ఉత్కంఠ

Posted by:
 
Share this on your social network:
   Facebook Twitter Google+    Comments Mail

ఆరో గదిపై బుధవారం దాకా ఉత్కంఠ
న్యూఢిల్లీ: తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి నేలమాళిగలోని ఆరో గదిని తెరవడంపై ఉత్కంఠకు తెర పడలేదు. బుధవారం వరకు ఉత్కంఠ కొనసాగనుంది. దానిపై ఈ నెల 21వ తేదీ బుధవారం నిర్ణయాన్ని వెలువరించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. అనంత పద్మనాభ స్వామి ఆరో గదిని తెరిచే విషయంపై నిపుణుల కమిటీ గురువారం సుప్రీంకోర్టుకు నివేదిక అందజేసింది. ఆ గదిని తెరవాలంటే మరింత భద్రత అవసరమని కమిటీ అభిప్రాయపడింది.

ఆరో గదిపై తమ నిర్ణయం సంప్రదాయాలకు, ప్రజల విశ్వాసాలకు అనుగుణంగానే ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. సంపద సంరక్షణకు సడలింపులు కూడా ఉంటాయని చెప్పింది. సంపదను ఆలయంలోనే ఉంచాలని కమిటీ అభిప్రాయపడింది. ఆరో గదిని తెరవకూడదని, సంపదను వీడియో, ఫొటో తీయడం ఆలయ సంప్రదాయాలకు విరుద్ధమని ట్రాంవకోర్ రాచకుటుంబం అభిప్రాయపడింది.

English summary
The Supreme Court on Friday deferred its decision on opening the Vault B of Kerala’s Padmanabhaswamy Temple till September 22.
Write a Comment
AIFW autumn winter 2015