హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రస్తుత రాజకీయాలకు జగన్ పనికి రాడు: జగన్ ఎమ్మెల్యే

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: ప్రస్తుత రాజకీయాలకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పనికి రాడని ఆయన వర్గానికి చెందిన కాంగ్రెసు శానససభ్యుడు ఆదినారాయణ రెడ్డి అన్నారు. జగన్ రాజకీయాలపై ఆయన శనివారం మీడియా ప్రతినిధుల వద్ద సంచలన వ్యాఖ్యలు చేశారు. లాబీయింగ్ చేయడం, ఖర్చు పెట్టడం జగన్‌కు రాదని ఆయన అన్నారు. జగన్ కొత్త పంథాలో వ్యవహరించాలని, తన పంథా మార్చుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యకర్తలతో, నాయకులతో చనువుగా ఉండాలని ఆయన అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నానని, ఇకపై తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆయన అన్నారు. కాళ్లపై పడి తాము కాంగ్రెసుకు మద్దతివ్వడం లేదని, తమపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి ఉందని ఆయన అన్నారు.

నియోజకవర్గం అభివృద్ధి పనుల కోసమే తాము కాంగ్రెసుకు మద్దతిస్తున్నామని ఆయన చెప్పారు. వేగంగా పనులు జరగాలంటే అధికార పార్టీ వెంట ఉండాలని ఆయన అన్నారు. కాంగ్రెసు కార్యాలయానికి తాము వెళ్లాల్సిన పని లేదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలను ఎవరు అమలు చేసిన ఫరవా లేదని, వైయస్ రాజశేఖర రెడ్డిపై అభిమానంతోనే తాము వైయస్ జగన్‌కు మద్దతిస్తున్నామని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే దానికి వ్యతిరేకంగా తాను ఓటేస్తానని, తాను కాంగ్రెసు శాసనసభ్యుడిగానే ఎన్నికయ్యానని ఆయన అన్నారు. ఇప్పుడు ఎమర్జెన్సీ లేదు, జగన్‌తో ఉండాల్సిన పని లేదని ఆయన అన్నారు.

వైయస్ జగన్ తమను ఎప్పుడూ ప్రలోభపెట్టలేదని, జగన్‌కు ఇప్పుడు తమ అవసరం లేదని ఆయన అన్నారు. అవసమైనప్పుడు తాము జగన్‌కు మద్దతిస్తామని ఆయన అన్నారు. వైయస్ జగన్‌ను ఇబ్బంది పెట్టగలరే కానీ జైలుకు పంపించలేరని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికన్నా జగన్ వందశాతం ఉత్తమమని ఆయన అన్నారు. జగన్‌పై కాంగ్రెసు కన్నా తెలుగుదేశం పార్టీ ఎక్కువ కక్ష కట్టిందని ఆయన విమర్శించారు. చంద్రబాబు పెట్టే అవిశ్వాసంపై తమకు నమ్మకం లేదని ఆయన అన్నారు.

English summary
Congress MLA supporting YSR Congress party president YS Jagan, Adi narayana Reddy said that Jagan will not adjust in present day politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X