వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మ్యూజియం: పద్మనాభుడి సంపద ఇంటర్నెట్‌లో

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anantha Padmanabha Swamy Temple
తిరువనంతపురం: కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో బయటపడ్డ అపార సంపదను సామాన్య ప్రజలు అందరూ కూడా దర్శించుకునే అవకాశం త్వరలో కలుగనుంది. పద్మనాభ స్వామి ఆలయంలోని నేలమాళిగల్లో బయటబడిన సుమారు ఐదు లక్షల కోట్ల సంపదను ఫోటోల్లో బంధించి ఆన్ లైన్ ట్రెజర్ మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు. పద్మనాభుడి అనంత సంపదను కెల్ట్రాన్ అనే ప్రభుత్వ ఎలక్ట్రానిక్ రంగ సంస్థకు డిజిటలైజ్ చేసేందుకు అప్పగించారు. డిజిటల్ ఆల్పమ్ రూపకల్పన పూర్తయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారంతా ఆలయ నేలమాళిగల్లోని సంపద, కళాఖండాలను చూడ్డానికి ఇక భారత్ రావాల్సిన అవసరం లేదు. వారి వారి కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌లలోనే అంతర్జాలం ద్వారా దర్శించుకోవచ్చు.

ఈ తరహా ప్రాజెక్టు దేశంలో ఇదే మొదటిది అని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు విషయంలో విక్రమ్ సారాబాయ్ అంతరిక్ష కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కెల్ట్రాన్ అందించే డిజిటల్ సమాచారంలో ఆయా వస్తువుల నాణ్యతను కూడా వెల్లడిస్తారు. ప్రతి వస్తువుకూ ఓ విశిష్ట గుర్తింపు సంఖ్య ఇస్తారట.

English summary
Anantha Padmanabha Swamy treasure photos will put in internet soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X