జగన్‌పార్టీలో ఘర్షణ, మధ్యలో ప్రచారం ఆపిన మేకపాటి

Posted by:
 
Share this on your social network:
   Facebook Twitter Google+ Comments Mail

Mekapati Rajamohan Reddy
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పార్లమెంటు అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి సాక్షిగా రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఆదివారం రాజమోహన్ రెడ్డి తన నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీలోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.

దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇరువర్గాలకు నచ్చజెప్పేందుకు రాజమోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ వారు వినలేదు. దీంతో చేసేది లేక అతను ప్రచారాన్ని అర్ధాంతరంగా ముగించుకొని అక్కడి నుండి వెళ్లి పోయారు. కాగా రాజమోహన్ రెడ్డి జగన్‌కు అనుకూలంగా ఉంటూ ఇటీవల పార్లమెంటు స్థానానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదించడంతో పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నెల్లూరు పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది.

కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు శనివారం అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వైయస్ జగన్ తనను గుర్తించకపోవడంతో ఆయన అసంతృప్తికి గురైనట్లు చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలోని తన స్వగ్రామంలో చేసిన ప్రకటనకు జగన్ తనను ఆహ్వానించకపోవడం అసంతృప్తికి ప్రధాన కారణమని అంటున్నారు.

ప్రకాశం జిల్లా ఇంచార్జీగా తనను నియమించకపోవడంపై జూపూడి ప్రభాకర రావు అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. జగన్ వ్యవహార శైలి జూపూడి ప్రభాకర రావును బాధపెట్టిందని చెబుతున్నారు. నాయకులను పట్టించుకోని జగన్ తీరు ఆయన నచ్చలేదని అంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జూపూడి ప్రభాకర రావు ఎమ్మెల్సీ అయ్యారు.

వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జూపూడి ప్రభాకర రావు వైయస్ జగన్ వెంట ఉన్నారు. పార్టీ అధికార ప్రతినిధిగా కూడా నియమితులయ్యారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి విషయంలోనూ ఆయన సమర్థించుకుంటూ వస్తున్నారు. ఒక రకంగా చూస్తే జూపూడి ప్రభాకర రావుకు పార్టీలో మంచి స్థానమే కల్పించినట్లు చెబుతారు.

English summary
Differences took place in SPS Nellore district YSR Congress party. Party activists created tension before Party Nellore MP candidate Mekapati Rajamohan Reddy. He stopped his campaign with this issue.
Please Wait while comments are loading...
Your Fashion Voice
Advertisement
Content will resume after advertisement