చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెరువులో పడిన గల్లా కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Galla Aruna Kumari
చిత్తూరు: మంత్రి గల్లా అరుణ కుమారి కాన్వాయ్‌లో సోమవారం ప్రమాదం జరిగింది. అరుణ కుమారి కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక సబ్ ఇన్స్‌పెక్టర్, ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గల్లా అరుణ కుమారి సొంత నియోజకవర్గంలోనే చోటు చేసుకుంది.

గల్లా అరుణ తన నియోజకవర్గం చంద్రగిరిలోని చిన్నగొట్టిపల్లి మండలంలో పర్యటిస్తున్నారు. చిత్తెచర్ల సమీపంలో ఎస్కార్ట్ వాహనం బోల్తా కొట్టింది. బోల్తా కొట్టిన వాహనం చెరువులో పడిపోయింది. ఎస్కార్ట్ వాహనం అదుపు తప్పడంతో బోల్తా పడింది. కాగా గల్లా అరుణ కుమారి 2009 సాధారణ ఎన్నికలలో చంద్రగిరి నియోజకవర్గం నుండి ప్రస్తుత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, అప్పటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రోజాపై పోటీ చేసి గెలిచారు.

ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఆమె 1949 ఆగస్టు 1వ తేదిన దిగువమంగంలో జన్మించారు. ఈమె మాజీ పార్లమెంటు సభ్యులు పాటూరి రాజగోపాల్ నాయుడు కూతురు. ఆమె గల్లా రామచంద్ర నాయుడును వివాహం చేసుకున్నారు. ఇతను అమర రాజా గ్రూప్ కంపెనీ వ్యవస్థాపకులు.

ఈమె లేక్ వ్యూ కళాశాలలో బిఎస్‌లో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. ఈమె చంద్రగిరి నియోజకవర్గంలో 1989 నాటి ఎన్నికలలో గెలుపొందారు. ఆ తర్వాత 1999 నుండి వరుసగా గెలుస్తూ వస్తున్నారు.

English summary
Minister Galla Aruna Kumari convoy got accident in Chandragiri constituency of Chittoor district on Monday afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X