వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కేసు: జెడి కాల్ డేటా కోసం సిఐ హ్యాకింగ్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసు విచారణకు నేతృత్వం వహిస్తున్న సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మినారాయణ కాల్ డేటా కోసం సస్పెన్షన్‌కు గురైన పోలీసాఫీసర్ శ్రీనివాస రావు తన సీనియర్ల ఇ - మెయిల్ ఖాతాలను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. లక్ష్మినారాయణ కాల్ డేటా రికార్డు లీక్‌ కేసును దర్యాప్తు చేస్తున్న సిఐడి వర్గాలు శనివారం ఈ విషయం చెప్పాయి. లక్ష్మినారాయణ కాల్ డేటా రికార్డులను లీక్ చేశాడనే ఆరోపణపై నాచారం ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస రావు సస్పెన్షన్‌కు గురయ్యారు.

శ్రీనివాసరావును సిఐడి అధికారులు శనివారం రెండో రోజు ప్రశ్నించారు. శ్రీనివాస రావు కింది స్థాయి ఉద్యోగుల సాయంతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని డిప్యూటీ పోలీసు కమిషనర్ (డిసిపి) ఇ - మెయిల్ అకౌంట్ పాస్‌వర్డ్‌ను దొంగిలించి, సిడిఆర్స్ కోసం సర్వీస్ ప్రొవైడర్‌కకు రిక్వెస్ట్ పంపినట్లు చెబుతున్నారు. ఎస్పీ లేదా డిసిపి ర్యాంక్ అధికారికి మాత్రమే ఫోన్ కాల్ డేటా రికార్డుల కోసం రిక్వెస్ట్ పెట్టే అధికారం ఉంటుంది. అటువంటి రిక్వెస్ట్ పెట్టడం ద్వారా శ్రీనివాస రావు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు.

లక్ష్మినారాయణ, లీడ్ ఇండియా ప్రతినిధి చంద్రబాల ఫోన్ కాల్ డేటా రికార్డుల లీక్ కేసుల దర్యాప్తును సిఐడి శుక్రవారం తన చేతుల్లోకి తీసుకుంది. లక్ష్మినారాయణ చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నగర పోలీసులు కేసు నమోదు చేయగా, చంద్రబాల సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు ఫిర్యాదు చేశారు. కాల్ డేటా రికార్డుల లీకేజీ కేసులో శ్రీనివాస రావుపై, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి దినపత్రిక రిపోర్టర్ యాదగిరిరెడ్డిపై కేసులు నమోదయ్యాయి.

సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ కాల్ లిస్ట్ వ్యవహారంలో నాచారం సిఐ శ్రీనివాస రావుపై వేటు పడింది. సైబరాబాద్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు శుక్రవారం సిఐని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. శ్రీనివాస రావును సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ కాల్ లిస్ట్ వ్యవహారంలో నాచారం సిఐ శ్రీనివాస రావు పాత్ర ఉన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

English summary
Suspended police officer M Srinivasa Rao allegedly hacked into the e-mail account of his senior officer to acquire the phone call data of a top CBI official regarding the ongoing probe into the disproportionate assets case filed against YSR Congress chief Jagan Mohan Reddy, CID sources said on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X