హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌తో ఉప్పులేటి భేటీ: విజయమ్మ, భారతి కూడా

By Pratap
|
Google Oneindia TeluguNews

Uppuleto Kalpana - YS Vijayamma
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఉప్పులేటి కల్పన గురువారం ఉదయం హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో కలిశారు. ఆమెతో పాటు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు సామినేని ఉదయభాను కూడా జగన్‌ను కలిశారు.

కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడిన తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఎప్పుడు చేరేదీ ప్రకటిస్తాననని ఉప్పులేటి కల్పన వైయస్ జగన్‌తో భేటీ తర్వాత మీడియా ప్రతినిధులతో చెప్పారు. వైయస్ జగన్ వెంట ప్రజలున్నారని, జగన్‌కు ప్రజాదరణ ఉందని ఆమె అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని కార్యకర్తలు ఏడాది కాలంగా ఒత్తిడి చేస్తున్నారని, ఆ పార్టీలో చేరితేనే విజయం లభిస్తుందనే నమ్మకం ఉందని ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పోలిట్‌బ్యూరో సమావేశం నిర్ణయాలను ఎప్పుడూ అమలు చేయలేదని ఆమె విమర్శించారు తెలుగుదేశం పార్టీలో దళితులకు, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందని ఆమె అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, తల్లి వైయస్ విజయమ్మ, సతీమణి భారతి గురువారం ఉదయం వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఉప్పులేటి కల్పన ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డిని కలిశారు. దీంతో ఆమెను పార్టీ నుంచి తెలుగుదేశం సస్పెండ్ చేసింది. కల్ప మేకపాటి రాజమోహన్ రెడ్డిని కలవడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణించింది.

ఉప్పులేటి కల్ప గత రెండు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తొలుత నిడుమోలు నుంచి, ఆ తర్వాత 2009లో పామర్రు నుంచి పోటీ చేశారు. వరుసగా రెండు సార్లు ఓడిపోయినప్పటికీ కల్పనను చంద్రబాబు పార్టీ పోలిట్‌బ్యూరోలోకి తీసుకున్నారు. పామర్రు పార్టీ ఇంచార్జీగా కూడా కొనసాగిస్తున్నారు.

ఇదిలా వుంటే, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తారనే విషయాన్ని వైయస్ జగన్ ఇంకా తేల్చలేదు. ఓటేయడానికి అనుమతి కోరుతూ ఆయన ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌లో కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయడానికి తనకు అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీ, సంగ్మాల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంపై నిర్ణయం తీసుకునే బాధ్యతను వైయస్ జగన్‌కు కట్టబెడుతూ తీర్మానం చేసింది. ఈ విషయంపై తన నిర్ణయాన్ని జగన్ విజయమ్మతో చెప్పి ఉంటారని అంటున్నారు.

English summary
Suspended Telugudesam party leader Uppuleti Kalpana met YSR Congress party president YS Jagan at Chanchalguda jail in Hyderabad. YS Vijayamma and Vharathi also met YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X