రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటుకు అనుమతించండి: జగన్

Subscribe to Oneindia Telugu

YS Jagan
హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికలలో తనకు ఓటు వేసేందుకు అనుమతించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు హైదరాబాదులో ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. తనకు ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ నుండి అనుమతి వచ్చిందని చెప్పారు.

ఓటింగ్ వద్దకు తనను జైలు అధికారులు తీసుకు వెళ్లే విధంగా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఓటు అనేది తనకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ఎన్నికలలో పాల్గొనే విధంగా చూడాలని కోరారు. జగన్ పిటిషన్ స్వీకరించిన కోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ నెల 19వ తేదిన రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. తనను ఓటింగుకు అనుమతించాలని జగన్ గతంలో కోర్టును ఆశ్రయించారు.

అయితే ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ఓటు విషయం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని సూచించారు. దీంతో జగన్ ఎన్నికల సంఘాన్ని కోరారు. ఓటు వేసేందుకు ఈసి అనుమతించింది. దీంతో జగన్ తాజాగా ఓటు వేసేందుకు తనకు ఈసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఓటింగ్ వద్దకు తనను తీసుకు వెళ్లేందుకు అనుమతివ్వాలని ఆయన ఈ రోజు పిటిషన్ దాఖలు చేశారు.

కాగా యుపిఏ అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీ, ఎన్డీయే అభ్యర్థిగా పిఏ సంగ్మా బరిలో నిలిచిన విషయం తెలిసిందే. వీరిద్దరూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీని తమకు మద్దతివ్వాల్సిందిగా కోరారు. సంగ్మా వైయస్ విజయమ్మను కలవగా, ప్రణబ్ ఫోన్ చేసి మద్దతు అడిగారు.

English summary
YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan Reddy filed a petition in CBI special court to vote on presidentital polls.
Please Wait while comments are loading...