అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న రెజ్లర్ సుశీల్

Subscribe to Oneindia Telugu
Sushil Kumar
న్యూఢిల్లీ, జులై 16: ఈ నెల 27 నుండి లండన్‌లో ప్రారంభం కానున్నఒలంపిక్స్ ప్రారంభ వేడుకల్లో పాల్గోనే భారత క్రీడాకారుల బృందానికి రెజ్లర్ సుశీల్ కుమార్ సారథ్యం వహించనున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ విషయంలో సస్పెన్స్ కొనసాగించిన భారత ఒలంపిక్ సంస్ద (ఐఓఏ) ఆదివారం అధికారకంగా సుశీల్ కుమార్ పేరుని ప్రకటించింది. బీజింగ్‌ ఒలింపిక్స్‌లో సుశీల్‌ కుమార్‌ కాంస్య పతకం సాధించాడు. ఈ గౌరవం కోసం షూటర్ అభినవ్ బింద్రా, లియాండర్ పేస్, విజేందర్ సింగ్ పేర్లు తెరపైకి వచ్చాయి.

తొలుత ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత, స్టార్‌ షూటర్‌ అభినవ్‌ బింద్రాను భారత పతాకధారిగా ఎంపిక చేయాలని ఒలింపిక్‌ సంఘం నిర్ణయించిన.. ప్రారంభోత్సవ వేడుకలు ముగిసిన వెంటనే షూటింగ్‌ పోటీలు ఉండడంతో బింద్రా దీనికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆలాగే స్టార్‌ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌కు అవకాశం ఇవ్వాలని ఒలింపిక్స్‌ సంఘం భావించినప్పటికీ.. విజేందర్‌కు కూడా పోటీలు ఉండడంతో సుశీల్‌కు బాధ్యతలు అప్పగించారు. టెన్నిస్‌ దిగ్గజం లియాం డర్‌ పేస్‌ 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో పతాకధారిగా ఉన్నాడు. దీంతో ఈసారి అతని పేరును పరిశీలించలేదు. ఈ నెల 30న ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుకలు జరుగనున్నాయి.

తెలుగు వన్ఇండియా

English summary
Ending days of speculation, the IOA on Sunday announced that wrestler Sushil Kumar, a bronze medallist at the Beijing Games, will be the flagbearer of the Indian contingent at the upcoming London Olympics.
Please Wait while comments are loading...