యుఎస్ ఓపెన్: భూపతి, సానియా వేరు వేరు జోడీలతో

Posted by:
Give your rating:

Sania Mirza-Mahesh Bhupathi
న్యూఢిల్లీ, ఆగస్టు 30: యుఎస్ ఓపెన్‌లో భారత స్టార్ మిక్స్‌డ్ డబుల్స్ జోడీ మహేష్ భూపతి - సానియా మిర్జాలు కలిసి ఆడకూడదని నిర్ణయించుకున్నారు. లండన్ ఒలింపిక్స్‌కు ముందు తలెత్తిన సెలక్షన్ వివాదాల వల్లే వీరిద్దరూ జోడి విడిపోయినట్లు సమాచారం. ఈ విషయంపై సానియా మిర్జా మాట్లాడుతూ ‘ఒలింపిక్స్‌కు వరకే మేమిద్దరం కలిసి ఆడాలనుకున్నాం. గతంలో, ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని బ్రేక్ తీసుకోవాలనుకున్నాం' అని చెప్పింది.

గతంలో భూపతి-సానియా జోడీ రెండు గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గింది. ఒలింపిక్స్‌కు ముందు వీరి జోడీ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో విజేతలుగా నిలిచారు. 2009 ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ నెగ్గారు. లండన్‌ ఒలింపిక్స్‌ వివాదాల నడుమ లియాండర్‌ పేస్‌తో సానియా బరిలోకి దిగింది. జట్ల ఎంపిక విషయంలో తనను పావుగా వాడుకున్నారని సానియా బహిరంగంగానే విమర్శించిన సంగతి తెలిసిందే.

ఈ సంఘటనే సానియా, భూపతిల జోడి విడిపోవడానికి కారణమైంది. బోపన్నతో జతకట్టడానికి చూపిన చోరవ తనపై చూపక పోవడంతో సానియా కలత చెందింది. అన్యూహంగా యుఎస్‌ ఓపెన్‌లో కొత్త జంటలతో వీరు పోటీకి సిద్ధమయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌లో సానియా... బ్రిటన్ డబుల్స్ స్పెషలిస్ట్ కొలిన్ ఫ్లెమింగ్‌తో జతకట్టగా, భూపతి... అండ్రియా హల్వకోవా (చెక్)తో కలిసి బరిలోకి దిగుతున్నాడు.

తెలుగు వన్ఇండియా

English summary
Sania Mirza and Mahesh Bhupathi have decided to split as a pair, ending the speculation over their future as a mixed doubles team following the bitter selection row ahead of the London Olympics.
Please Wait while comments are loading...
Advertisement
Content will resume after advertisement