ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు పాదయాత్ర: వాస్తు భయంతో ఆదిలాబాద్‌కు స్వస్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు నుంచి పాదయాత్రను ప్రారంభించాలనే ఆలోచనకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వస్తి చెప్పారు. వాస్తుదోషం అడ్డం రావడంతో ఆయన ఆ ఆలోచనకు స్వస్తి చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో ఆయన తన పాదయాత్ర ప్రారంభానికి మరో ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి పాదయాత్రను ప్రారంభించాలనుకుంటే మహబూబ్‌నగర్ జిల్లాలోని కోస్గిని, సీమాంధ్ర నుంచి ప్రారంభించాలని అనుకుంటే అనంతపురం జిల్లాలోని హిందూపురాన్ని ఆయన ఎంచుకుంటారని పార్టీ వర్గాలు చెబుతుననాయి.

జ్యోతిష్కుల సలహా మేరకు ఆయన ఆదిలాబాద్ నుంచి పాదయాత్రను ప్రారంభించాలనే ఆలోచనకు స్వస్తి చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, పాదయాత్రకు ముందే తెలంగాణపై పార్టీ వైఖరిని చంద్రబాబు ప్రకటించే అవకాశాలు లేవని అంటున్నారు. కేంద్రం ఏర్పాటు చేసే అఖిల పక్ష సమావేశంలోనే తెలంగాణపై పార్టీ వైఖరి చెప్పాలని ఆయన తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

తెలంగాణ అంశంపై రెండు కళ్ల సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారంటూ చంద్రబాబుపై చాలా కాలం నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇటు తెలంగాణలో ప్రత్యేక వాదాన్ని, అటు సీమాంధ్రలో సమైక్యవాదాన్ని ఆయన బలపరుస్తూ వస్తున్నారు. దీంతో తెలంగాణలో చంద్రబాబు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారని అంటున్నారు. ఈ స్థితిలో తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి ఈ ప్రాంతం నుంచి పాదయాత్రను ప్రారంభించాలని ఆయన అనుకుంటున్నారు.

చంద్రబాబు సుదీర్ఘ పాదయాత్ర అక్టోబర్ 2వ తేదీన ప్రారంభమై 117 రోజుల పాటు సాగి గణతంత్ర దినోత్సవం రోజు వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన ముగుస్తుంది. రోజుకు 20 కిలోమీటర్ల నడక సాగించాలని ఆయన అనుకుంటున్నారు. ఆ రకంగా రెండు వేల కిలోమీటర్లకు పైబడి పాదయాత్ర చేయడానికి ఆయన సిద్ధపడ్డారు. కోరితే పాదయాత్రలో పాల్గొనడానికి తాను సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు బావమరిది, సినీ హీరో బాలకృష్ణ చెప్పారు.

English summary
Telugu Desam president N Chandrababu Naidu is likely to begin his padayatra from Kosigi in Mahbubnagar district on October 2. Chandrababu, who had initially thought of commencing his padayatra from Adilabad district, has changed his mind after astrologers advised him against it. Though a couple of places in Andhra region too were suggested including Hindupur in Anantapur district, Naidu is more inclined to begin his march from Mahbubnagar district to send a message that he is not villainous as he is being projected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X