హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు ఇన్సిపిరేషన్: రోహిత్, నారా-నందమూరి అంటూ..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nara Rohit-Chandrababu Naidu
హైదరాబాద్: హీరో నారా రోహిత్ తనకు స్వర్గీయ నందమూరి తారక రామారావు, తన పెదనాన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, మావయ్య హీరో నందమూరి బాలకృష్ణలు తనకు ఇన్సిపిరేషన్ అని ఆదివారం చెప్పారు. హైదరాబాదులో నారా రోహిత్ కథానాయకుడిగా, నిత్యామీనన్న నాయకిగా నటించిన ఒక్కడినే చిత్రం పాటలు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడారు.

తనకు ముగ్గురు ఇన్సిపిరేషన్ అని చెప్పారు. వారిలో మొదటి వారు స్వర్గీయ నందమూరి తారక రామారావు, రెండోవారు తన పెదనాన్న నారా చంద్రబాబు నాయుడు, మూడో వారు హీరో నందమూరి బాలకృష్ణ అని చెప్పారు. తాను సినిమా ఇండస్ట్రీలోకి వెళతానని, హీరోగా నటిస్తానని తన పెదనాన్న చంద్రబాబుకు చెప్పినప్పుడు ఏ పని చేసినా డిడెకేషన్‌తో చేయాలని సూచించారని రోహిత్ అన్నారు.

అభిమానులను ఉద్దేశిస్తూ.. నారా - నందమూరి అభిమానులు అంటూ పలకరించారు. తన బాణం, సోలో సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరించారని, ఈ ఒక్కడినే సినిమాను కూడా ఆదరిస్తారని, అంతకంటే పెద్ద హిట్ చేస్తారని తాను ఆశిస్తున్నానని చెప్పారు. బాలకృష్ణ మావయ్యని ఆదరించినట్లుగానే తనను ఆదరిస్తారని కోరుకుంటున్నానని చెప్పారు. ఆ తర్వాత మాట్లాడిన నందమూరి బాలకృష్ణ కూడా నారా - నందమూరి అభిమానులు అంటూ పలకరించారు.

కాగా ఒక్కడినే చిత్రంలో నారా రోహిత్ కథానాయకుడిగా నటిస్తున్నారు. నిత్యామీనన్ హీరోయిన్. నాగేంద్రబాబు కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. శ్రీనివాస్ రాగా డైరెక్టర్. నిర్మాత సివి రెడ్డి. నారా రోహిత్ చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు తనయుడు.

English summary
Hero Nara Rohit praised his father in law and TDP chief Nara Chandrababu Naidu in his Okkadine audio release function.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X