వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీతమ్మ వాకిట్లో.. ఆ సన్నివేశాలు తొలగించాలి: వీరశివా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Veerasiva appeals SVSC film unit
హైదరాబాద్: విక్టరీ వెంకటేష్, ప్రిన్స్ మహేష్ బాబు, అంజలి, సమంత నాయకానాయికలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలోని ఓ సన్నివేశంపై కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే వీరశివా రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాలో శ్రీరామ నవమి కల్యాణ వేదికలో అపశృతులు చోటు చేసుకున్నట్లుగా చూపడం తనను తీవ్ర మనస్థాపానికి గురి చేసిందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సినిమా ప్రదర్శన నిలిపివేసి, ఆ అభ్యంతరకర సన్నివేశాలని తొలగించాలని ఆయన చిత్ర యూనిట్‌కు విజ్ఞప్తి చేశారు. సినిమాలోని అగ్నిప్రమాద సన్నివేశం భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందన్నారు. ఆ సన్నివేశాన్ని వెంటనే తొలగించాలన్నారు. అప్పటి వరకు సినిమా ప్రదర్శనను నిలిపి వేయాలని కోరారు.

శ్రీరామనవమి రోజున భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణవేదికలో భక్తులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్న సమయంలో విద్యుదాఘాతం వల్ల అగ్ని ప్రమాదం సంభవించడం, దాంతో భక్తులు ప్రాణభయంతో పరుగులు తీయడం కలిచివేసిందన్నారు.

శ్రీ సీతారామ చంద్రస్వామి కళ్యాణాన్ని లోక కళ్యాణంగా భక్తులు భావిస్తారని, ఈ కళ్యాణానికి ముక్కోటి దేవతలు విచ్చేసి సీతారామ చంద్రులపై పూల వర్షాన్ని కురిపిస్తారని, అష్ట దిక్పాలకులు స్వామి వారి కళ్యాణ ఏర్పాట్లకు రక్షణగా నిలుస్తారని, పంచ భూతాలు సహితం సహకరిస్తాయని పురాణ ఇతిహాసాల్లో ఉందని గుర్తు చేశారు. ఇందుకు భిన్నంగా ఈ చిత్రంలో సన్నివేశాన్ని తీయడం సరికాదన్నారు.

English summary
Kamalapuram MLA Veerasiva Reddy has appealed Seethamma Vakitlo Sirimalle Chettu film unit to remove Srirama Navami incident from movie.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X