వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్సైపై దాడి, అరెస్ట్ భయం: అజ్ఞాతంలో టిడిపి ఎమ్మెల్యే!

By Srinivas
|
Google Oneindia TeluguNews

West Godavari District
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి. చింతమనేని ప్రభాకర్ కోసం ఆరు పోలీసుల బృందాలు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. అతనిని అరెస్టు చేసేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారని సమాచారం.

కాగా చింతమనేని ప్రభాకర్ పైన, ఆయన గన్‌మెన్ పైన పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును సోమవారం నమోదు చేశారు. వారితో పాటు మరో ఇద్దరి పైనా కేసు నమోదయింది. పెదవేగి ఎస్సై బండి మోహన రావు సిబ్బందితో పినకడిమి గ్రామానికి వెళ్లారు. అక్కడ పేకాట ఆడుతున్న వారిని పట్టుకున్నారు.

పేకాట ఆడుతున్న వారిని పట్టుకొని తీసుకు వెళ్తుండగా ఎమ్మెల్యే తన కారుతో తమను అడ్డగించారని, తనను చంపుతానంటూ బెదిరిస్తూ కొట్టారని ఎస్సై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే గన్‌మన్, అనుచరులు శాసనసభ్యుడికి సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎస్సై ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆయనను అరెస్టు చేయాలని భావించారు. గన్‌మన్, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే కోర్టులో లొంగిపోతారన్న సమాచారంతో సోమవారం ఆ పరిసరాల్లో మోహరించిన పోలీసులు ఆయన రాకపోవడంతో వెనుదిరిగారు. ఈ రోజు ఆయన కోసం గాలిస్తున్నారు.

English summary
It is said that West Godavari Police are searching for Denduluru Telugudesam Party MLA Chintamaneni Prabhakar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X