ఊరట: వీరప్పన్ అనుచరుల ఉరిశిక్షపై స్టే పొడిగింపు

Posted by:
 
Share this on your social network:
   Facebook Twitter Google+    Comments Mail

 వీరప్పన్ అనుచరుల ఉరిశిక్షపై స్టే పొడిగింపు
న్యూఢిల్లీ: గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అనుచరులు నలుగురికి జాతీయ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో బుధవారం ఊరట లభించింది. ఉరి శిక్ష అమలుపై స్టే పొడిగిస్తూ బుధవారం ఉదయం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు స్టే కొనసాగుతుందని, తుది తీర్పు వచ్చే వరకు ఉరి శిక్ష అమలు చేయరాదని సుప్రీం కోర్టు తాజాగా ఆదేశాలను జారీ చేసింది.

వీరప్పన్ అనుచరుల ఉరి శిక్షపై బుధవారం ఉదయం విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఉరితీతను మరోసారి వాయిదా వేసింది. ఉరిపై స్టేను ఆరు వారాలపాటు పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వీరప్పన్ అనుచరుల ఉరి శిక్ష అమలుపై సుప్రీం కోర్టు ఈ నెల 18వ తేదిన విచారణ జరిపి తాత్కాలిక స్టే ఇచ్చి, తదుపరి విచారణ బుధవారం నాటికి వాయిదా వేసింది.

ఉరి శిక్షపై మరొక బెంచ్‌ విచారణ జరుపుతోందని, ఆ బెంచ్ తీర్పు వచ్చే వరకూ ఎదురు చూద్దామని సుప్రీం బెంచ్ తెలిపింది. వీరప్పన్ అనుచరులు జ్ఞానప్రకాశ్, సైమన్, మీ సేకర్ మాదయ్య, బిలవెంద్రన్‌లు కర్నాటకలోని పాలర్ ప్రాంతంలో మందుపాతర పేల్చి 22 మంది పోలీసులను బలిగొన్న కేసులో వారికి మరణశిక్ష అమలు చేయాలని 2004లోనే సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.

మొదట ఈ ఘటనలో మైసూర్ కోర్టు దోషులకు జీవిత ఖైదు విధించింది. అనంతరం సుప్రీం కోర్టు వీరి జీవిత ఖైదును ఉరిశిక్షగా మార్చింది. వారి క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 13వ తేదిన తిరస్కరించారు. దీంతో వారు ఉరి శిక్షపై సుప్రీం కోర్టుకు వెళ్లారు.

English summary
The Supreme Court on Wednesday extended its interim order staying the execution of death sentence imposed on four aides of sandalwood smuggler Veerappan for killing 22 police personnel in a landmine blast in Karnataka in 1993.
Write a Comment
AIFW autumn winter 2015