కిరణ్ 'తొలి' ఆపరేషన్ 2: దారి చూపిన కమల్(పిక్చర్స్)

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నటుడు కమల్ హాసన్ చూపించిన దారిలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా తీస్తున్న ఆపరేషన్ దుర్యోదన-2 చిత్రం నిర్మాతలు నడువనున్నారట. కిరణ్ పాలనకు మద్దతుగా న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ముఖ్యమంత్రిగా నటిస్తున్న చిత్రం ఆపరేషన్ దుర్యోదన-2. ఈ చిత్రం విడుదలలో కమల్ హాసన్ తరహాలో వ్యవహరించాలని నిర్ణయించుకున్నారట.

విశ్వరూపం చిత్రాన్ని థియేటర్లలో కంటే ముందే డిటిఎస్ ద్వారా విడుదల చేయాలని కమల్ భావించిన విషయం తెలిసిందే. ఇది వివాదాస్పదమైన విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పుడు ఈ చిత్రాన్ని కూడా అదే పద్ధతిలో మొదట విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ సినిమాను మార్చి 15వ తేదిన డిటిఎచ్ ద్వారా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారట. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎయిర్ టెల్ డిటిహెచ్‌తో టై అప్ కూడా చేసుకున్నారు.

థియేటర్ల కంటే ముందే టిడిఎచ్ ద్వారా విడుదల చేయడం ద్వారా ఎక్కువ మంది ప్రజల్లోకి/ఓటర్లలోకి కిరణ్ పథకాలను తీసుకు వెళ్లవచ్చుననే భావనతో ఉన్నారట. ఈ సినిమా కోసం రూ.5 కోట్లు ఖర్చు పెట్టిన కిరణ్ మద్దతుదారులు డిటిహెచ్ ద్వారా మూడు కోట్ల రూపాయలు వస్తున్నాయని భావిస్తున్నారట. అదే సమయంలో కిరణ్‌ను హైలెట్ చేసినట్లవుతుందని భావిస్తున్నారు. ఏప్రిల్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశముంది.

మార్చి 15నే దీనిని డిటిహెచ్ ద్వారా విడుదల చేయడం ద్వారా కిరణ్ పాలనా పటిమ కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు చూసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారట. ఆ తర్వాత థియేటర్లలో విడుదల చేయడం ద్వారా మిగిలిన డబ్బును రాబట్టుకోవచ్చునని భావిస్తున్నారట. డిటిహెచ్ దారి చూపిన కమల్‌కు వీరు థ్యాంక్స్ కూడా చెప్పారు. చిన్న సినిమాలకు ఇది సదవకాశం అని చెప్పారు.

ఆపరేషన్ దుర్యోదన 2లో ముఖ్యమంత్రి పాత్రధారి ఏరాసు ప్రతాప్ రెడ్డితో జగపతి బాబు

చిత్రంలో సిఎంగా ఏరాసు

ఏరాసు చెబుతుండగా వింటున్న జగపతి బాబు

ఓ సన్నివేశంలో పోసానితో ఏరాసు, పక్కన జగపతి బాబు!

కమల్ డిటిహెచ్ దారిలోనే ఇప్పుడు ఆపరేషన్ దుర్యోదన-2 నడవాలనుకుంటోంది. కమల్ సినిమా వివాదం అయినప్పటికీ ఈ సినిమాకు అలాంటి సమస్య ఎదురయ్యే అవకాశాలు లేవు!

ఆపరేషన్ దుర్యోదన 2 చిత్రం ద్వారా కిరణ్ పాలనను హైలెట్ చేయాలనుకుంటున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు సినిమాను డిటిహెచ్ ద్వారా విడుదల చేసి ప్రజల్లోకి తీసుకు వెళ్లాలనే భావనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ సినిమా డిటిహెచ్ ద్వారా విడుదలయితే ఇదే మొదటి సినిమా కానుంది.

English summary
Move over Vishwaroopam, it will most probably be the Telugu political potboiler Operation Duryodhan 2, the propaganda film on Chief Minister Kiran Kumar Reddy, which will be the first movie to premier on DTH along with its theatrical release on March 15.
Please Wait while comments are loading...