ఎమ్మెల్సీ ఎన్నికలు: సిఎల్పీకి జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలు

Posted by:
 
Share this on your social network:
   Facebook Twitter Google+    Comments Mail

సిఎల్పీకి జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు వెళ్లిన కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు గొట్టిపాటి రవి కుమార్, మద్దాల రాజేష్, పేర్ని నానిలు సోమవారం సిఎల్పీ(కాంగ్రెసు పార్టీ శాసనసభా పక్ష కార్యాలయం) కార్యాలయానికి వచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. వారు సిఎల్పీ కార్యాలయానికి రావడంపై విలేకర్లు కాంగ్రెసు గూటికి తిరిగి చేరుకున్నారా? అని ప్రశ్నించారు.

అందుకు పేర్ని నాని స్పందిస్తూ.. అదేం లేదని, ఇక్కడున్న విలేకరులతో మాట్లాడుతామని వచ్చామని సరదాగా అన్నారు. సిఎల్పీ టీ పార్టీ ఇస్తే తాము వచ్చామని ఎమ్మెల్యేలు చెప్పారు. టీ పార్టీ తర్వాత వారు సిఎల్పీ కార్యాలయం నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభా పక్ష కార్యాలయానికి వెళ్లారు.

అంతకుముందు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కాంగ్రెసు, టిడిపిల నుండి వచ్చిన ఎమ్మెల్యేలు హాజరయిన విషయం తెలిసిందే. తానేటి వనిత, శిరియా సాయిరాజ్, రాజేష్, పేర్ని నాని, గొట్టిపాటి రవి కుమార్, ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

త్వరలో ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జగన్ వర్గం కాంగ్రెసు ఎమ్మెల్యేలు సిఎల్పీ కార్యాలయానికి వెళ్లడం మొదట ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెసు పార్టీ వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. అయితే, ఇది సాధారణ తేనీటి విందేనని మరికొందరు చెబుతున్నారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy camp Congress MLAs attended to CLP's tea party on Monday.
Write a Comment