గ్రాండ్ ఎంట్రీ: జగన్‌పై టాలీవుడ్ మమకారం!(పిక్చర్స్)

Posted by:
 
Share this on your social network:
   Facebook Twitter Google+    Comments Mail

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖులు ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి దూకేస్తున్నారు! 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి హవా వీస్తుందని భావిస్తున్న నేపథ్యంలో పలువురు నేతలు ఆయన వైపు మొగ్గు చూపుతున్నారు. అదే దారిలో టాలీవుడ్ ప్రముఖులు కూడా చేరుతున్నారు. కొందరు సినీ తారలు పరోక్షంగా, ప్రత్యక్షంగా పలు పార్టీలకు మద్దతు పలుకుతున్నారు.

ఇతర పార్టీలలో ప్రముఖంగా ఉన్న నేతలు, ఆ పార్టీలలో ఇమడలేకపోయిన పలువురు జగన్ పార్టీ వైపు చూస్తున్నారు. మరికొందరు తమ రాజకీయ భవిష్యత్తు కోసం జగన్ వెంట అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు గ్రాండ్ ఎంట్రీ కోసం వస్తున్నారు. ఏదేమైనా జగన్ హవా వీస్తుందనే అభిప్రాయంతో వీరంతా ఆయన వైపు చూస్తున్నారని అంటున్నారు. జగన్ పార్టీలో ప్రస్తుతం తారలలో రోజా ప్రముఖంగా కనిపిస్తున్నారు.

రోజా, గిరిబాబు, విజయ చందర్, పోసాని మురళీ కృష్ణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం జగన్ వైపు వెళ్లారు. నటులు శ్రీహరి, నరేష్ కూడా తాము జగన్ పార్టీలోకి వెళ్తానని చెప్పారు. జయప్రద యుపి నుండి రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారు. ఆమె కూడా వీరి దారిలోనే పయనించే అవకాశాలు ఉన్నాయి. మోహన్ బాబు, దాసరి నారాయణ రావు, కృష్ణం రాజులు చేరుతారనే ప్రచారం కొంతకాలం క్రితం జరిగింది. పూరీ జగన్నాథ్ సోదరుడు, సతీమణికి జగన్ పార్టీ టిక్కెట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని గతంలో వార్తలు వచ్చాయి.

టిడిపి తరఫున పోటీ చేసి ఓడిపోయిన రోజా జగన్ పార్టీ స్థాపించాక ఆయన పార్టీలోకి వెళ్లారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తానని శ్రీహరి ఇటీవల జైలులో జగన్‌ను కలిసిన అనంతరం చెప్పారు. రాజకీయ ఆరంగేట్రం జగన్‌తో చేయాలనుకుంటున్నారు.

జగన్ పార్టీలో చేరేందుకు సీనియర్ నరేష్ సిద్ధమయ్యారు. ఈయన గతంలో బిజెపి నేతగా ఉన్నారు.

జయప్రద జగన్ గూటికి వెళ్లేలా కనిపిస్తున్నారు. టిడిపిలో కీలకంగా వ్యవహరించి, ఆ తర్వాత ఆ పార్టీలో ఇమడలేక యుపి వెళ్లి తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి జగన్ పార్టీ ద్వారా పునరాగమనం చేయాలని భావిస్తున్నారు.

మోహన్ బాబు, దాసరి నారాయణ రావు వంటి వారు జగన్ పార్టీకి వెళ్తారనే ప్రచారం అప్పట్లో సాగింది.

బిజెపి హయాంలో కేంద్రమంత్రిగా పని చేసిన కృష్ణం రాజు ఆ తర్వాత చిరంజీవి స్థాపించిన పిఆర్పీలోకి వెళ్లారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఆయన జగన్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది.

రాజశేఖర్, జీవితలు జగన్ పార్టీ పెట్టిన కొత్తలో ఆయన వైపు వెళ్లినా ఇమడలేక తిరిగి కాంగ్రెసు బాటే పట్టారు.

జయసుధ జగన్ పార్టీలోకి వచ్చినా మళ్లీ కాంగ్రెసు గూటికి చేరుకున్నారు. దివంగత వైయస్ వల్ల కాంగ్రెసు ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన జయసుధ తిరిగి కాంగ్రెసుకే జై కొట్టారు.

మరోవైపు జగన్ పార్టీలోకి నటీ నటులు చేరుతున్నా గతంలో ఆయన పార్టీలోకి వెళ్లి తిరిగి వచ్చిన వారు లేకపోలేదు. రాజశేఖర్, జీవిత దంపతులు జగన్‌కు మొదట మద్దతుగా నిలిచినా ఆ తర్వాత తిరిగి కాంగ్రెసుకే ఓటేశారు. సికింద్రాబాద్ శాసనసభ్యురాలు జయసుధ సైతం జగన్‌కు మొదట అండగా నిలిచింది. ఆ తర్వాత కిరణ్‌కు జై కొట్టింది. కాగా, పలువురు టాలీవుడ్ ప్రముఖులు జగన్‌కు అనుకూలంగా చిత్రాలు నిర్మించారనే అభిప్రాయాలు కూడా వెల్లువెత్తిన విషయం తెలిసిందే. జగన్ వంటి సినిమాలు జగన్‌కు మద్దతుగా వచ్చిన సినిమాలు అనే అభిప్రాయముంది. గ్రాండ్ రీ ఎంట్రీ కోసం కొందరు, ఎంట్రీ కోసం కొందరు, రాజకీయ భవిష్యత్తు కోసం మరికొందరు జగన్ వైపు చూస్తుండటం గమనార్హం.

English summary
It is said that Tollywood directors, actors and actress are interesting to join in YS Jagan's YSR Congress Party.
Write a Comment