వేధింపులని ఫిర్యాదుచేస్తే.. యువతిపై పోలీసుల దాష్టీకం

Posted by:
 
Share this on your social network:
   Facebook Twitter Google+    Comments Mail

యువతిపై పోలీసుల దాష్టీకం
చండీగఢ్: ట్రక్కు డ్రైవర్ల వేధింపులు తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేయబోయిన ఓ యువతిపై, ఆమె తండ్రిపై పోలీసులు లాఠీఛార్జ్ చేసిన సంఘటన పంజాబ్ రాష్ట్రంలో సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన తమను చితకబాదిన పోలీసులను ఉద్యోగంలో నుండి తీసివేయాలని బాధిత యువతి మంగళవారం డిమాండ్ చేశారు.

విషయానికి వస్తే.. పంజాబ్‌లోని తర్న్ తరన్ జిల్లాలో ఆధివారం ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్న ఓ యువతిని ట్రక్కు డ్రైవర్లు వేధించారు. ఈ విషయమై ఆమె తన తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన వారి పైనే పోలీసులు లాఠీఛార్జ్ ఝులిపించడం వివాదాస్పదమయింది. నిందితుల నుండి లంచం తీసుకొని తనను, తన తండ్రిని పోలీసులు కొట్టారని ఆరోపించారు.

తన తండ్రిని పోలీసులు కొడుతుండగా తాను అడ్డు పడితే తనను కూడా కొట్టారని ఆమె ఆరోపించింది. పోలీసులు ట్రక్కు డ్రైవర్లను వెనుకేసుకు వచ్చి తండ్రీ కూతుళ్లను నడి వీధిలో చితకబాదిన సంఘటనను ఓ వ్యక్తి సెల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. దీంతో పోలీసులు వ్యవహారం బయటకు వచ్చింది. ప్రభుత్వం వారిపై లాఠీఛార్జ్ ఝులుపించిన ఇద్దరు పోలీసులను సోమవారం నాడు సస్పెండు చేసింది.

ఈ ఘటనపై బాధిత యువతి స్పందిస్తూ.. తనపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయడం కాదని, ఉద్యోగంలో నుండి తొలగించాలని డిమాండ్ చేసింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని బాధిత మహిళ చెప్పింది. ఈ ఘటనపై ఎంపి జయబాచ్చన్ పార్లమెంటులో ప్రస్తావించారు. మీడియా రోజుకో కొత్త అంశాన్ని వెలుగులోకి తీసుకు వస్తుందని, సామాన్యుడికి రక్షణ లేకుండా పోయిందన్నారు.

English summary
After public pressure, Punjab Chief Minister Prakash Singh Badal on Tuesday ordered a magisterial probe into the Tarn Taran incident of a victim of sexual harassment being beaten up in full public view by the Punjab police.
Write a Comment
AIFW autumn winter 2015