హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీ గురించి జనం ఏమంటున్నారు?(ఫోటోఫీచర్)

By Bojja Kumar
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ ఎన్నికల రథ సారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం హైదరాబాద్‌లో తలపెట్టిన నవభారత యువ భేరి సభకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. మోడీ నాయకత్వాన్ని బల పరిచేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి మోడీ బహిరంగ సభకు తరలి వచ్చారు.

మోడీ అంటే కేవలం నాయకుడు కాదని, మోడీ అంటే అభివృద్ధి అని అంటున్నారు సభకు హాజరైనవారు. మోడీ ప్రధాని అయితే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని, అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని, విద్య...వైద్యం...ఉపాధి రంగాలు ప్రగతి సాధిస్తాయని తమ ఆశాభావం వ్యక్తం చేసారు.

ప్రస్తుతం దేశంలో అవినీతి పాలన నడుస్తోందని, ప్రజల సొమ్మును దోచుకునే అవినీతి పరులకు ప్రస్తుత ప్రభుత్వాలు కొమ్ముస్తున్నాయని, అసమర్థుల పాలనలో దేశం అన్ని రంగాల్లో వెనకబడి పోయిందని.......అవినీతి పాలనను అంతమొందించేందుకు మోడీ వస్తున్నాడని, ప్రధాని పీఠమెక్కి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాడని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తాడని, ప్రపంచ మేటి దేశాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాడని అంటున్నారు.

సభా ప్రాంగణంలో మోడీ గురించి పలువురు వ్యక్తం అభిప్రాయాలు స్లైడ్ షోలో...

గుజరాత్‌ తరహా అభివృద్ధి

గుజరాత్‌ తరహా అభివృద్ధి

నరేంద్ర మోడీ మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికై గుజరాత్ రాష్ట్రాన్ని అద్భుతమైన అభివృద్ధి పథంలో నడిపించారు. అలాంటి అభివృద్ధి దీక్షా పరుడు ప్రధాని అయితే దేశం అన్ని రంగాల్లో ముందుకెలుతుంది
-కె. బాబు

గొప్ప ప్రధానిని దేశ చూడబోతోంది

గొప్ప ప్రధానిని దేశ చూడబోతోంది

త్వరలో దేశం గొప్ప ప్రధాన మంత్రిని చూడబోతోంది. నరేంద్ర మోడీకి ఒక్కసారి ప్రధానిగా అవకాశం ఇస్తే దేశం రూపురేఖలు మారుతాయని యువతరం నమ్ముతోంది. ఆయన నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుకెలుతుందని నమ్ముతున్నాం.
-రవీంద్ర

సర్వరోగ నివారిణి మోడీ

సర్వరోగ నివారిణి మోడీ

దేశంలో నెలకొన్ని అన్ని సమస్యలు తీరాలంటే మోడీ ప్రధాని కావాలి. ఆయన నాయకత్వంలో దేశ ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారు.
-నారాయణరెడ్డి

మోడీ ది బెస్ట్

మోడీ ది బెస్ట్

ప్రస్తుతం దేశంలో ఉన్న నాయకుల్లో మోడీని మించిన ఉత్తమ నాయకుడు లేడు. ప్రస్తుతం దేశానికి నాయకత్వం వహిస్తున్న వారి చేతికాని తనం రోజూ చూస్తేనే ఉన్నాం. అందుకే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.
-సుధాకర్ రెడ్డి

మోడీ హీరో...రాహుల్ జీరో!

మోడీ హీరో...రాహుల్ జీరో!

మోడీ లాంటి అభివృద్ధి దీక్షా పరుడు, అనుభవజ్ఞుడు ప్రధాని అయితేనే దేశానికి మేలు.... రాహుల్ గాంధీ లాంటి వారిని ప్రధాని పీఠంపై కూర్చోపెట్టడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. నీతివంతమైన, అభివృద్ధితో కూడిన పాలన రావాలంటే మోడీ ప్రధాని కావాలి.
-తాళ్ల రవీందర్

మోడీ ప్రధాని కావాలి

మోడీ ప్రధాని కావాలి

దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపై ఒక విజన్ ఉన్న వ్యక్తి. ఆయన ప్రధాని అయితే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుస్తుంది.
-సుబ్బరత్నమ్మ

దోపీడీ పాలన పోయి మోడీ పాలన రావాలి

దోపీడీ పాలన పోయి మోడీ పాలన రావాలి

ప్రస్తుతం కాంగ్రెస్ నేతృత్వంలో నడుస్తున్న దోపిడీ పాలన పోయి మోడీ పాలన రావాలి. మోడీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది. మోడీ నాయకత్వంతో ప్రజలు సంతృప్తికర జీవితం సాగిస్తారు.
-కె నారాయణ

మతతత్వ పాలన కాదు...అభివృద్ధి పాలన

మతతత్వ పాలన కాదు...అభివృద్ధి పాలన

మోడీ నిజాయితీ పరుడు, అందరికీ ఆదర్శ వంతుడు. ఆయన ప్రధాని అయితే దేశం అన్ని రంగాల్లో ముందుకు వెలుతుంది. ఆయన మతతత్వ వాది అనే వాదన సరైందికాదు, ఆయన పాలనలో అన్ని మతాల వారికి సమన్యాయం జరుగుతుంది.
-ఆంజనేయులు

యువత మెచ్చిన నాయకుడు

యువత మెచ్చిన నాయకుడు

నరేంద్ర మోడీ యువత మెచ్చిన నాయకుడు. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అన్ని రంగాల్లో దేశం ముందుకు వెలుతుంది. అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు తెచ్చుకుంటుంది.
-రిషికేష్

మోడీ పాలన బెస్ట్

మోడీ పాలన బెస్ట్

మోడీ పాలన ఎంతో ఉత్తమమైనది అనడానికి గుజరాత్ రాష్ట్రమే నిదర్శనం. ఆయన ప్రధాని అయితే దేశం మొత్తం అభివృద్ధి చెందుతుంది. అన్ని రంగాలు ప్రగతి సాధిస్తాయి.
-ఎన్.పూరాణ్ సింగ్

మోడీ నాయకత్వం అవసరం

మోడీ నాయకత్వం అవసరం

ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితుల్లో మోడీ నాయకత్వం అవసరం. దేశంలో అనేక రంగాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. మోడీ ప్రధాన మంత్రి అయితే అవినీతి పాలన అంతమొంది అన్ని రంగాలు అభివృద్ది పతంలో నడుస్తాయి.
-కెసుధాకర్

భయం లేకుండా బ్రతుకుతాం

భయం లేకుండా బ్రతుకుతాం

నరేంద్ర మోడీ ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలాంటి భయం లేకుండా బ్రతుకుతారు. ప్రస్తుతం ఉన్న పాలకులకు ధైర్యం లేదు. వారి పాలన కొనసాగితే దేశానికి రక్షణ లేకుండా పోతుంది. మెడీ ప్రధాని అయితే అభివృద్ధితో పాటు ఆత్మస్థైర్యం వస్తుంది.
-హేమ కులకర్ణి

మహిళలకు రక్షణ

మహిళలకు రక్షణ

ప్రస్తుతం దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై అకృత్యాలు జరుగుతున్నాయి. మోడీ ప్రధాని అయితే మార్పు వస్తుంది. దేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది.
-నాగేశ్వరి

భారత్ నవ నిర్మాణం

భారత్ నవ నిర్మాణం

నరేంద్ర మోడీ సారథ్యంలోనే భారత్ నవనిర్మాణం సాధ్యం. ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడవాలంటే నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి కావాలి.
-నరేష్

 వికలాంగులకు మేలు

వికలాంగులకు మేలు

మోడీ ప్రధానమంత్రి అయితే వికలాంగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దేశం అభివృద్ధి చెంది అన్ని రంగాల్లో ముందుకు వెలుతుంది.
-హరి బాబు

English summary
BJP compaign committee chairman and Gujarath CM Narendra Modi has addresed Nava Bharath Yuva bheri meeting at LB stadium in Hyderabad. Public has shown lot of interest on his Hyderabad visit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X