వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరకం చూశాం, పశుపతినాథుడి వల్లే బతికాం: ఢిల్లీకి 54మంది తెలుగువారు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తాము అక్కడ నరకమెంటో చూశామని నేపాల్‌లో భూకంపం బారినుంచి తప్పించుకున్న తెలుగు వారు అన్నారు. పశుపతినాథుడి దయ వల్లే తాము బతికి బయటపడ్డామని వారు చెప్పారు. స్థానిక ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఎన్నో ఇబ్బం దులు పడ్డామని, భారతీయ వాయుసేన చొరవతోనే ఢిల్లీకి చేరుకోగలిగామన్నారు.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానంలో ఢిల్లీకి చేరుకున్న బాధితుల్లో మొత్తం 54 మంది తెలుగువారున్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్, హయత్‌నగర్‌కు, ఇతర జిల్లాలకు చెందిన 35 మంది, ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మార్టేరు, రావులపాలెం, వెలుగులేరుకి చెందిన 19 మంది ఉన్నారు.

ఢిల్లీలోని ఏపీభవన్, తెలంగాణ భవన్ సిబ్బంది బాధితులను ఆయా భవన్‌లకు తరలించి, వసతి ఏర్పాటు చేశారు. భయంకరమైన భూకంపం బారి నుంచి ఆ పశుపతినాథుడి దయతోనే బయటపడగలిగినట్టు హైదరాబాద్, హయత్‌నగర్ మండలం శాంతినగర్ కాలనీ వాసులు తెలిపారు. 35 మంది పశుపతినాథ్ యాత్రకు వెళ్లినట్టు చెప్పారు.

'మేం పశుపతినాథ్ దర్శనం చేసుకుని తిరిగి వస్తుంటే ఈ ప్రళయం చోటుచేసుకుంది. అప్పుడు మేమంతా బస్సులో ఉన్నాం. బస్సు ఒక్కసారిగా ఊగడం మొదలయ్యింది. మేమంతా భయంతో ఆ దేవుణ్ని తలచుకుంటూ కూర్చున్నాం. కొద్దిసేపటి తర్వాత ఒక ఓపెన్‌ప్లేస్‌కి మా బస్సును తీసుకెళ్లాక ఊపిరి పీల్చుకున్నాం' అని శాంతినగర్‌కి చెందిన శశికళ కన్నీటి పర్యంతమయ్యారు.

ఢిల్లీ ఏపీభవన్‌కి చేరుకున్న 54 మంది బాధితులను నాలుగు విమానాల్లో ఆదివారం సాయంత్రానికే వారి స్వస్థలాలకు పంపినట్టు సిబ్బంది తెలిపారు. మరికొందరు ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉందని, భారత విదేశాంగశాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ తెలుగు రాష్ట్రాల వారిని స్వస్థలాలకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఆదివారం రాత్రి మరో తొమ్మిది మంది బాధితులు ఢిల్లీకి చేరుకున్నారని, వీరిలో ఐదుగురు హైదరాబాద్‌కి చెందిన వారు, నలుగురు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వారు ఉన్నారని ఏపీ భవన్ సిబ్బంది తెలిపారు. సోమవారం ఉదయం వీరిని స్వస్థలాలకు పంపనున్నట్టు చెప్పారు. కాగా, నేపాల్‌లో వైద్య విద్యనభ్యసిస్తున్న పలువురు తెలుగు విద్యార్థులు కూడా ఢిల్లీకి చేరుకున్నారు.

ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు

ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు

తాము అక్కడ నరకమెంటో చూశామని నేపాల్‌లో భూకంపం బారినుంచి తప్పించుకున్న తెలుగు వారు అన్నారు. పశుపతినాథుడి దయ వల్లే తాము బతికి బయటపడ్డామని వారు చెప్పారు.

ఢిల్లీలో..

ఢిల్లీలో..

స్థానిక ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఎన్నో ఇబ్బం దులు పడ్డామని, భారతీయ వాయుసేన చొరవతోనే ఢిల్లీకి చేరుకోగలిగామన్నారు.

ఢిల్లీలో..

ఢిల్లీలో..

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానంలో ఢిల్లీకి చేరుకున్న బాధితుల్లో మొత్తం 54 మంది తెలుగువారున్నారు.

ఢిల్లీలో..

ఢిల్లీలో..

ఢిల్లీలోని ఏపీభవన్, తెలంగాణ భవన్ సిబ్బంది బాధితులను ఆయా భవన్‌లకు తరలించి, వసతి ఏర్పాటు చేశారు.

English summary
It said that 54 telugu peoples are reached delhi from nepal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X