వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

70 అడుగుల లోకేష్ కటౌట్, హైటెక్ సిటి: మహానాడులో 43 రకాల వంటకాలు

మహానాడు ప్రాంగణంలో టిడిపి యువనేత, మంత్రి నారా లోకేష్ 70 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 9.25గంటలకు మహానాడు ప్రారంభంకానుంది.

|
Google Oneindia TeluguNews

విశాఖ: మహానాడు ప్రాంగణంలో టిడిపి యువనేత, మంత్రి నారా లోకేష్ 70 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 9.25గంటలకు మహానాడు ప్రారంభంకానుంది.

చదవండి: అమిత్ షాను కన్విన్స్ చేసేందుకు చంద్రబాబు

ఈ మహానాడులో మొత్తం 24 తీర్మానాలను ఆమోదించనున్నారు. ఏపీ నుంచి 18, తెలంగాణ నుంచి 6 తీర్మానాలను చేయనున్నారు. అలాగే ఈ మహానాడు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 26 వేల మంది హాజరవుతారు.

అయితే 16వేల మందికి ప్రాంగణంలో కుర్చీలు ఏర్పాటు చేయగా వేదికపై మరో 250 మంది నేతలు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. వేదికకు ఒక వైపు హైటెక్ సిటీ, రెండో వైపు పోలవరం నమూనాలు ఏర్పాటు చేశారు.

nara lokesh

43 రకాల వంటకాలు

విశాఖలో జరుగుతున్న మహానాడుకు వస్తున్న ప్రతినిధుల కోసం మొత్తం 43 రకాల వంటలను సిద్ధం చేశారు. అలాగే ఒకేసారి 4 వేలమంది భోజనాలు చేసేలా ఏర్పాట్లు చేశారు. మెనూలో ఆంధ్రా, తెలంగాణ వంటకాలు తయారు చేస్తున్నారు.

భారీ భద్రత

ఇదిలా ఉండగా మహానాడుకు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. మూడువేల మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నారు.

అలాగే 3వేల హోటల్ రూమ్స్, 30 ఫంక్షన్ హాళ్లల్లో బస ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాలైన రాయలసీమ ఉత్తరాంధ్ర నుంచి టిడిపి కార్యక్తరలు భారీగా మహానాడు ప్రాంగణానికి చేరుకుంటున్నారు. అలాగే తెలంగాణ నుంచి మహానాడుకు రెండు రైళ్లలో కార్యక్తరలు వస్తున్నారు.

English summary
With just one day to go for the beginning of the TDP’s mega show ‘Mahanadu’, the entire police team is busy giving finishing touches to the security plan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X