హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పదేళ్ల బాలుడి కిడ్నాప్: రూ. 10లక్షల డిమాండ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడకు చెందిన పదేళ్ల బాలుడు రోహిత్(10) శుక్రవారం కిడ్నాప్‌కు గురయ్యాడు. ఉదయం పాఠశాలకు వెళ్లిన రోహిత్ పాఠశాల ముగిసిన తర్వాత కూడా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన రోహిత్ తల్లిండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తమ కుమారుడు కిడ్నాప్‌కు గురయ్యాడని పోలీసులకు తెలిపారు. గుర్తుతెలియని దుండుగులు తమకు ఫోన్ చేసి రూ. 10లక్షలు డిమాండ్ చేస్తున్నారని పోలీసులు చెప్పారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. దుండుగులు ఏ నెంబర్ నుంచి ఫోన్ చేశారు, ఏ ఎక్కడి నుంచి ఫోన్ చేశారు అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

పాఠశాలల యాజమాన్యాలకు పోలీసులు డెమో క్లాసులు

A 10 years old boy kidnapped in Hyderabad

పాకిస్థాన్‌లోని పెషావర్ సైనిక పాఠశాలపై ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో నగరంలోని పాఠశాలల యాజమాన్యలతో నగర పోలీసులు సమావేశం నిర్వహించారు. పాఠశాలల యాజమాన్యాలు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై పోలీసులు వారికి వివరించారు. పాకిస్థాన్‌లో జరిగిన ఘటన ఇక్కడ జరగకపోవచ్చు కానీ, మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

అప్రమత్తంగా లేకుంటే అనర్థాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. స్కూల్ ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాల వద్ద సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సిసి కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఈ విషయంపై హైదరాబాద్‌లోని అన్ని పాఠశాలలకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు.

తాము సూచించిన భద్రతా చర్యలు తీసుకోనట్లయితే.. పాఠశాలల మూసివేతకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానిత వస్తువులు, లంచ్ బాక్సుల లాంటివి కనిపిస్తే వాటిని తెరవకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఐబి హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలను చేపట్టారు.

ట్యాంకర్ కూలి నలుగురు చిన్నారులకు గాయాలు

అనంతపురం: జిల్లా బొమ్మనహళ్ మండలం దర్గాహోనూరులో నిర్మాణంలో ఉన్న మినీ ట్యాంకు కూలి ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని బెంగళూరులోని విమ్స్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

English summary
A 10 years old boy kidnapped in Kushaiguda, in Hyderabad on Friday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X