చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వార్నీ.. ఆఫ్ట్రాల్ క్లర్క్.. ఆస్తులు మాత్రం రూ.కోటి పైనే! ఎంతమంది ఉసురు పోసుకున్నాడో!!

అతడు ఆఫ్ట్రాల్ ఓ క్లర్క్. కానీ ఆస్తులు చూస్తే మాత్రం కళ్లు చెదిరిపోతాయి. కోటి రూపాయలకు పైగానే కూడబెట్టాడు. ఎంతమంది ఉసురుపోసుకున్నాడో మరి!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

తిరుపతి: అతడు ఆఫ్ట్రాల్ ఓ క్లర్క్. కానీ ఆస్తులు చూస్తే మాత్రం కళ్లు చెదిరిపోతాయి. అన్నీ కలుపుకుంటే కోటి రూపాయల వరకు ఉంటాయి. అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేసే వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు మరి!

చిత్తూరు అర్బన్‌ జిల్లా పరిధిలోని డీపీఓ కార్యాలయంలో సీనియర్‌ క్లర్క్‌గా పనిచేస్తున్న బి.వెంకటేశానికి ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని వచ్చిన ఫిర్యాదులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడిచేశారు.

corruption

ఏకకాలంలో చిత్తూరు జిల్లాలోని నాలుగు ప్రదేశాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీ నిర్వహించారు. ఆర్‌అండ్‌బీ విలువ ప్రకారం ఒకటిన్నర కోటికి పైగా విలువ చేసే ఇల్లు, 15 సెంట్లు, 12 సెంట్ల విస్తీర్ణం గల రెండు స్థలాలు, 300 గ్రాముల బంగారం, వెండి, ఇతర విలువైన ఎలక్ట్రానిక్‌ పరికరాలను అధికారులు గుర్తించారు.

తిరుపతి ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి, కడప ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బృందం తనిఖీ చేపట్టింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

English summary
Tirupati: A government employee who is working as senior cleark in the office of DPO has been found in possesson of above Rs.1 crore worth movable and immovable properities, which is hugely in disproportion to his know sources of income. The Anti-Corruption Bureau (ACB) conducted raids on B.Venkatesam houses which are located in four places in the district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X