విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కుమార్తెపై వేధింపులు: ఆత్మహత్యకు తండ్రి వేడుకోలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: చేయని నేరం ఒప్పుకోవాలని తన కుమార్తెను కంచరపాలెం క్రైం ఎస్ఐ సంతోష్ వేధిస్తున్నారని అదే ప్రాంతానికి చెందిన నగరి లక్ష్మణ రావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన కుమార్తె, భార్యతో బుధవారం పోలీస్ కమిషనరేట్ క్రైం డిసిపికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితురాలు నగరి ప్రియాంక, ఆమె తల్లి, తండ్రి మాట్లాడుతూ.. కంచరపాలెం క్రైం పోలీసులు మూడు రోజులుగా ఇంటరాగేషన్ పేరుతో దుర్భాషలాడటమే కాకుండా థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు.

పట్నాల నందిని అనే మహిళ, ఆమె కుటుంబసభ్యులు, బంధువుల ఫిర్యాదుల మేరకు ఆ నేరాలు ఒప్పుకోవాలని లేదా మరికొన్నింటిలో ఇరికించి 15ఏళ్ల జైలు నుంచి రాకుండా చేస్తామని, కోర్టులో బెయిల్ రాకుండా చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. తన కుమార్తెపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్‌లో సస్పెట్ సీటు ఉన్నందున తన కుమార్తెను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు.

కేసుతో సంబంధం ఉందని మర్యాదగా ఒప్పుకోకపోతే అదే విధంగా తమ కుటుంబసభ్యుల్లో అందరినీ ఈ కేసులో ఇరికించగల సమర్థత ఫిర్యాదు చేసిన వారికి ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఈ వేధింపులు భరించే స్థితిలో లేమని ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని క్రైం డిసిపిని వేడుకునేందుకు వచ్చినట్లు వారు తెలిపారు.

బుధవారం ఉదయం డిసిపిని కలిసేందుకు ఆటోలో కమిషనరేట్‌కు వస్తున్న తమను పోలీసులు వెంబడించారని బాధితులు తెలిపారు. క్రైం డిసిపి సెలవులో ఉండటంతో క్రైం ఏడిసిపి ఎస్ వరదరాజును కలిసి వినతి పత్రం అందజేశారు.

బాధితులు

బాధితులు

చేయని నేరం ఒప్పుకోవాలని తన కుమార్తెను కంచరపాలెం క్రైం ఎస్ఐ సంతోష్ వేధిస్తున్నారని అదే ప్రాంతానికి చెందిన నగరి లక్ష్మణ రావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన కుమార్తె, భార్యతో బుధవారం పోలీస్ కమిషనరేట్ క్రైం డిసిపికి ఫిర్యాదు చేశారు.

బాధితులు

బాధితులు

ఈ సందర్భంగా బాధితురాలు నగరి ప్రియాంక, ఆమె తల్లి, తండ్రి మాట్లాడుతూ.. కంచరపాలెం క్రైం పోలీసులు మూడు రోజులుగా ఇంటరాగేషన్ పేరుతో దుర్భాషలాడటమే కాకుండా థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు.

బాధితులు

బాధితులు

పట్నాల నందిని, ఆమె కుటుంబసభ్యులు, బంధువుల ఫిర్యాదుల మేరకు ఆ నేరాలు ఒప్పుకోవాలని లేదా మరికొన్నింటిలో ఇరికించి 15ఏళ్ల జైలు నుంచి రాకుండా చేస్తామని, కోర్టులో బెయిల్ రాకుండా చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.

బాధితులు

బాధితులు

తన కుమార్తెపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్‌లో సస్పెట్ సీటు ఉన్నందున తన కుమార్తెను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు.

బాధిరాలు

బాధిరాలు

కేసుతో సంబంధం ఉందని మర్యాదగా ఒప్పుకోకపోతే అదే విధంగా తమ కుటుంబసభ్యుల్లో అందరినీ ఈ కేసులో ఇరికించగల సమర్థత ఫిర్యాదు చేసిన వారికి ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించామని క్రైం ఏడిసిపి ఎస్ వరదరాజు తెలిపారు. వారి ఆరోపణలపై విచారణ చేపడతామని చెప్పారు. బాధితురాలు గతంలో పలు నేరాల్లో నిందితురాలని, రెండు కేసుల్లో ఆమెకు కోర్టు శిక్ష కూడా విధించిందని తెలిపారు. ప్రస్తుతం ఓ కేసులో ఆమెపై కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదు మేరకు క్రైం పోలీసులు విచారిస్తున్నారని ఆయన చెప్పారు.

English summary
A false case filed on my daughter, says a father belongs to Visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X