విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హడల్: దెయ్యం భయంతో మూతపడిన పాఠశాల

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం ఓబర్తిలో దెయ్యం ఉందనే భయంతో ఓ బడికి తాళం పడింది. 15 రోజుల క్రితం వరకు బడి విద్యార్థులతో కళకళలాడుతూ ఉండేదని శనివారం వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత పాఠశాల పేరు ఎత్తితేనే విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

దీంతో విద్యార్థులు లేకుండా పాఠశాల ఖాళీగా దర్శనమిస్తోందని వార్తలు వచ్చాయి అయితే స్కూల్‌కు వెళ్లకపోవడానికి గల కారణాన్ని విద్యార్థులు భయంగా చెబుతున్నారని కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం ఆ గ్రామానికి చెందిన భీములమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. ఆమెను అక్కడ దగ్గర్లో ఉన్న శ్మశానంలో పూడ్చిపెట్టారు. స్కూలుకు వెళ్లాలంటే ఆ దారి గుండానే వెళ్లాలి.

A school in Visakhapatnam district in Andhra Pradesh was closed with a fear of ghost.

దీంతో దెయ్యంగా మారిన భీములమ్మ తమను భయపెడుతోందంటూ విద్యార్థులు అంటున్నట్లు కూడా స్థానిక మీడియా రాసింది. అటుగా వెళ్లిన వారిపై రాళ్లు రువ్వుతోందని చెబుతున్నారు. దెయ్యంగా మారిన భీములమ్మ ఓ ఇంట్లో ఉందంటూ గ్రామస్తులు ఆ ఇంటిని సైతం తగులబెట్టారు. అప్పటి నుంచి మరింతగా భయపెడుతోందని గ్రామస్తులు చెబుతున్నారు.

దీంతో పిల్లలకు ఎంత నచ్చజెప్పినా బడికి వెళ్లడం లేదంటున్నారు. టీచర్లు వచ్చినా ఎంత నచ్చజెప్పినా విద్యార్థులు మాత్రం స్కూల్ వైపు కన్నెత్తైనా చూడటం లేదని మీడియా రాసింది.

English summary
A school in Visakhapatnam district in Andhra Pradesh was closed with a fear of ghost.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X