వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమీర్ ఖాన్ చిచ్చు: స్నాప్‌డీల్‌కు చిక్కులు, ఫ్లిప్‌కార్ట్ బన్సల్ కాపాడేయత్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిన సామెతలా ఉంది ఈ కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్ పరిస్థితి. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన మత అసహనం వ్యాఖ్యలు స్నాప్‌డీల్‌కు చిక్కులు తెచ్చి పెట్టాయి. అమీర్ ఖాన్ వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.

అమీర్ ఖాన్ ఈ కామర్స్ దిగ్గజం స్నాప్‌‍డీల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. దీంతో నెటిజన్లు అమీర్ ఖాన్ పైన కోపాన్ని స్నాప్ డీల్ పైన కూడా చూపిస్తున్నారు. అమీర్ వ్యాఖ్యలపై స్పందించిన నెటిజన్లు తమ మొబైల్ ఫోన్లలోని స్నాప్‌డీప్ యాప్‌ను వాపస్ చేయడంతో పాటు సదరు యాప్ రేటింగ్‌ను బాగా తగ్గించేస్తున్నారు.

Aamir Khan's Intolerance Remarks: Snapdeal's Android App Downrated in 'Protest'

మీ బ్రాండ్ అంబాసిడర్ దేశద్రోహి అని, ఆ ద్రోహిని తొలగించేదాకా మీ యాప్ ద్వారానే కాక సైట్ ద్వారా కూడా వస్తువులు కొనుగోలు చేయమని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమీర్ ఖాన్ వ్యాఖ్యలతో నడరం సంబంధం లేదని స్నాప్‌డీల్ ప్రకటించినప్పటికీ నెటిజన్ల ఆగ్రహం చల్లారడం లేదు.

కౌంటర్‌గా అమీర్ ఖాన్ మద్దతుదారులు స్నాప్‌‍డీల్‌కు 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నారు. మరోవైపు స్నాప్‌డీల్ ఈ కామర్స్ ప్రత్యర్థి ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకులు మద్దతుగా నిలబడ్డారు. బ్రాండ్ అంబాసిడర్‌ల ప్రకటనలతో ఆయా బ్రాండ్‌లకు సంబంధం ఉండదని చెప్పారు. తద్వారా అమీర్ ఖాన్ వ్యాఖ్యలు, స్నాప్‌డీల్‌ను వేర్వేరుగా చూడాలని అభిప్రాయపడ్డారు.

అమీర్ ఖాన్ వ్యక్తిగత పరిధిలో చేసిన వ్యాఖ్యలతో స్నాప్‌డీల్‌కు ఎలాంటి సంబంధం లేదని, స్నాప్‌డీల్ భారత్‌కు గర్వకారణమైన సంస్థ అని, యువ భారతీయులు అత్యంత ప్రేమతో నిర్మించిన ఈ సంస్ధ సమ్మిళిత డీజిటల్ ఇండియా నిర్మాణంలో దృష్టి పెట్టిందని స్నాప్ డీల్ వివరణ ఇచ్చింది.

ప్రతిరోజూ మేమే భారత్‌లోని వేలాది చిన్న వ్యాపారులు, లక్షలాది వినియోగదారులకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, భారత్‌లో పది లక్షల మంది విజయవంతమైన ఆన్‌లైన్ వ్యాపారవేత్తలను తయారు చేయాలని పెట్టుకున్న లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నామని పేర్కొంది.

English summary
Ratings for Snapdeal's app on Google Play Store took a beating on Tuesday, as thousands of people took to social media to voice their discontent over Aamir Khan's remarks against growing intolerance in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X