కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తండ్రి కోరిక: డాక్టర్ కావాలనుకొని మద్యలోనే భూమా ఇలా...

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అనుహ్య పరిస్థితిలో రాజకీయాల్లోకి వచ్చారు. డాక్టర్ కావాలని భావించిన భూమా నాగిరెడ్డి రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు కొనసాగారు. తండ్రి హత్యకు గురికావడంతో ఆయన తన చదువుకు

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అనుహ్య పరిస్థితిలో రాజకీయాల్లోకి వచ్చారు. డాక్టర్ కావాలని భావించిన భూమా నాగిరెడ్డి రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు కొనసాగారు. తండ్రి హత్యకు గురికావడంతో ఆయన తన చదువుకు స్వస్తి చెప్పాల్సిన పరిస్థితులు వచ్చాయి.

ప్రముఖ ప్యాక్షన్ నాయకుడిగా భూమా నాగిరెడ్డికి పేరుంది.అంతేకాదు తనను నమ్ముకొన్న తన అనుచరులకు అండగా ఉంటాడనే పేరు కూడ ఉంది. అందుకే భూమా ఏ పార్టీలో ఉంటే ఆయన వెంటే ఆయన అనుచరులు నడుస్తారు.

డాక్టర్ కావాలనుకొన్ని రాజకీయాల్లో అడుగుపెట్టిన భూమా నాగిరెడ్డి, అనివార్యంగానే ఆయన రాజకీయాల్లో కొనసాగారు. సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో కొనసాగినప్పటికీ కూడ ఆయన మంత్రి పదవి దక్కలేదు.

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కాని, శాశ్వత శత్రువులు కాని ఉండరు.అయితే ఇటీవలే ఆయన టిడిపిలో చేరారు. టిడిపిలో త్వరలోనే మంత్రి పదవి దక్కుతోందనే సమయంలోనే ఆయన మరణానికి గురికావడం విషాదాన్ని నింపింది.

డాక్టర్ కావాలని రాజకీయాల్లోకి భూమా నాగిరెడ్డి

డాక్టర్ కావాలని రాజకీయాల్లోకి భూమా నాగిరెడ్డి

భూమా నాగిరెడ్డి కర్నూల్ జిల్లా దొర్నిపాడు మండలం కొత్తపల్లె అనే మారుమూల గ్రామంలో జన్మించాడు భూమా నాగిరెడ్డి. బాలిరెడ్డి, ఈశ్వరమ్మ దంపతుల చిన్న కుమారుడే భూమా నాగిరెడ్డి.ఈ ప్రాంతంలో ఉన్న కుటుంబ కక్షల కారణంగా బాలిరెడ్డి తన కొడుకును చెన్నైలోని సిబిఎస్ఈ కి అనుబంధంగా ఉన్న వెలంకన్ని ప్రైవేట్ పాఠశాలలో ఇంటర్ వరకు చదివించాడు. ఆ తర్వాత నాగిరెడ్డి వైద్య విద్యను అభ్యసించేందుకు బెంగుళూరు వెళ్ళాడు. కానీ వెంటనే తన తండ్రిని ప్రత్యర్థులు హత్య చేయడంతో ఆయన డాక్టర్ చదువును మద్యలోనే వదిలేసి వచ్చేశారు.

 తండ్రి హత్యతో మారిన భూమా నాగిరెడ్డి

తండ్రి హత్యతో మారిన భూమా నాగిరెడ్డి

వైద్య విద్య చదివే సమయంలోనే తండ్రి హత్యకు గురికావడం భూమా నాగిరెడ్డి జీవితాన్ని మలుపుతిప్పింది. వైద్య విద్యను మద్యలో వదిలేసి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు భూమా నాగిరెడ్డి.1984 లో ఆయన రాజకీయాల్లోకి అనివార్యంగా రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.తొలుత సోసైటీ ప్రెసిడెంట్ గా ఆయన ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన ఎంపిపిగా ఎన్నికయ్యారు.1992 లో ఆళ్ళగడ్డ ఉప ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు.

శోభా నాగిరెడ్డితో వివాహం

శోభా నాగిరెడ్డితో వివాహం

తండ్రి మరణంతో స్వగ్రామానికి తిరిగి వచ్చిన భూమా నాగిరెడ్డి రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.అదే తరుణంలో మాజీ మంత్రి ఎస్ వి సుబ్బారెడ్డి కుమార్తై శోభానాగిరెడ్డిని భూమా వివాహం చేసుకొన్నాడు.శోభ నాగిరెడ్డి కుటుంబం కూడ రాజకీయాల్లో ఉండేది, భూమా నాగిరెడ్డి కుటుంబం కూడ రాజకీయాల్లో కొనసాగింది.అయితే శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి లు రాజకీయాల్లో కొనసాగారు.

హఠాత్తుగా మరణించిన శోభా, భూమా నాగిరెడ్డి

హఠాత్తుగా మరణించిన శోభా, భూమా నాగిరెడ్డి

2014 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళి తిరిగి వస్తుండగా శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమె అర్థరాత్రి చోటుచేసుకొన్న రోడ్డు ప్రమాదంలో మరణించారు.అయితే శోభా నాగిరెడ్డి మరణం భూమా నాగిరెడ్డిని మానసికంగా కృంగదీసింది.దీంతో ఆయన అనారోగ్యానికి గురయ్యారని చెబుతారు. బైపాస్ సర్జరీ కూడ జరిగింది.అదే సమయంలో ఆయన శోభా నాగిరెడ్డి స్థానంలో తన కూతురు అఖిల ప్రియను ఆళ్ళగడ్డ స్థానం నుండి బరిలోకి దింపారు.ఆమె ఆళ్ళగడ్డ నుండి విజయం సాధించారు. 2016 లో కూతురుతో కలిసి టిడిపిలో చేరిన భూమా నాగిరెడ్డికి త్వరలో మంత్రి పదవి వస్తోందనే ప్రచారం కూడ పార్టీలో ఉంది.అదే సమయంలో గుండెపోటుతో ఆయన మరణించడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా విషాదాన్ని నింపింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం

కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి విజయం కోసం భూమా నాగిరెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.ఎమ్మెుల్సీ ఎన్నికల విషయమై టిడిపి అధినేత చంద్రబాబుతో శనివారం నాడు భూమా నాగిరెడ్డి చర్చించి వచ్చారు. మరునాడే ఆయన గుండెపోటుతో మరణించాడు.తమ మద్య విబేధాలను పక్కన పెట్టి పార్టీ కోసం శిల్పా చక్రపాణి రెడ్డి గెలుపు కోసం భూమా పనిచేయాలని నిర్ణయించుకొన్నారని ఆయన సన్ని హితులు చెబుతున్నారు.

English summary
after father murdered bhuma nagi reddy dropped his study. when he was bangalore for studying doctor course, after his father murdered nagireddy returned from bangalore.first time he elected as a single window president in 1984.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X