ఈవో ఇష్యూపై పవన్ కళ్యాణ్‌కు రోజా షాక్, నా చేతులు పట్టుకున్నారని..

Subscribe to Oneindia Telugu

తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం రాజకీయాలు మాట్లాడిన రోజాపై కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి సోమవారం మండిపడ్డారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడటం తప్పని తెలిసినా మాట్లాడటం విడ్డూరమన్నారు.

చంద్రబాబును చూసి పారిపోయారని రోజా

వారి విజ్ఞతకే

అలా మాట్లాడటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. రోజా చెప్పే పిచ్చి మాటలు అర్థరహితం అన్నారు. అవి అభ్యంతరకరమన్నారు. అలాగే జగన్ ఇష్యూపై మాట్లాడుతూ.. ప్రధాని మోడీని ఎవరైనా కలువొచ్చని, ఎందుకు కలిశారో జగన్ చెప్పాలన్నారు.

తిరుమలలో రాజకీయాలు మాట్లాడవద్దా?

కాగా, అంతకుముందు రోజా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కొండమీద రాజకీయాలు మాట్లాడకూడదని చెప్పడం అవివేకం అన్నారు. చంద్రబాబు శ్రీవారి దర్శనానికి వచ్చి అనేక హామీలు ఇచ్చారని, చిత్తశుద్ధి ఉంటే ఆలయాల చుట్టూ బెల్టు షాపులు ఎత్తేయాలన్నారు.

పవన్ కళ్యాణ్‌కు నిన్న మోహన్ బాబు.. నేడు రోజా షాక్

ఐఏఎస్ అధికారులు ఏ ప్రాంతం వారు అయినా పర్వాలేదన్నారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధికి దోహదపడాలన్నారు. కాగా, టిటిడి సీఈవోగా అనిల్ సింఘాల్‌ను నియమించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కానీ నిన్న మోహన్ బాబు, నేడు రోజా మాత్రం చంద్రబాబు నిర్ణయాన్ని ఈ విషయంలో స్వాగతించారు. తద్వారా పవన్‌కు షాకిచ్చారు.

నా చేతులు పట్టుకున్నారని..

రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  తాను గతంలోనే చెప్పానని, తన చేతులు మళ్లీ పట్టుకున్నారని వ్యాఖ్యానించారు. లాస్ట్ టైం కూడా చెప్పానని, తన చేతులు లోపల పట్టుకున్నాడని వ్యాఖ్యానించారు. ఛానల్‌తో మాట్లాడిన ప్రకారం.. తిరుమలలో జరిగిందని అర్థమవుతోంది. గతంలో కూడా ఇలా ఓసారి జరిగిందని ఆమె అభిప్రాయపడ్డారు. 

English summary
After Mohan Babu, now YSR Congress Party MLA Roja shocks Jana Sena chief Pawan Kalyan.
Please Wait while comments are loading...