వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దటీజ్ మోడీ.. అలా జరగదు: ఒక్క చాన్స్‌తో జగన్‌కు దెబ్బ, తెలిసొచ్చింది

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఒక్క అపాయింటుమెంటుతో ఢిల్లీ.. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పవర్ ఏమిటో తెలిసి వచ్చిందని అంటున్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఒక్క అపాయింటుమెంటుతో ఢిల్లీ.. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పవర్ ఏమిటో తెలిసి వచ్చిందని అంటున్నారు. ఒక్కసారి భేటీకి అవకాశమిచ్చి జగన్‌ను మోడీ వివిధ రకాలుగా దెబ్బతీశారంటున్నారు.

కంటతడి పెట్టారు.. మోడీతో జగన్ భేటీ వెనుక రహస్యం ఇదీ!! కంటతడి పెట్టారు.. మోడీతో జగన్ భేటీ వెనుక రహస్యం ఇదీ!!

ఇటీవల ప్రధాని మోడీతో భేటీ కావడం, ఇది ఏపీలో రాజకీయ దుమారం రేపడం తెలిసిందే. జగన్‌తో జరిగిన భేటీ ద్వారా.. బీజేపీ ఎంతో కీలకంగా భావించే రాష్ట్రపతి ఎన్నికలకు మద్దతును కూడా మోడీ కూడగట్టారు.

ఒక్క అపాయింటుమెంటుతో..

ఒక్క అపాయింటుమెంటుతో..

చాలా రోజుల తర్వాత ప్రధాని మోడీ జగన్‌కు అపాయింటుమెంట్ ఇచ్చారు. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో భేషరతు మద్దతు పొందగలికారు. అంతేకాదు ప్రత్యేక హోదాపై జగన్ మరోసారి మాట్లాడకుండా చేశారని అంటున్నారు.

జగన్ విశ్వసనీయతను దెబ్బతీసిందని..

జగన్ విశ్వసనీయతను దెబ్బతీసిందని..

మోడీతో భేటీ కావడంతో జగన్‌.. తెలుగుదేశం, కాంగ్రెస్‌, వామపక్షాల దృష్టిలో చులకన అయ్యారని అంటున్నారు. అన్నింటికీ మించి విపక్షనేతగా ఉన్న ఆయన నేరుగా ప్రధాని వద్దకు వెళ్లి కేసుల గురించి వాపోవడం జనంలో జగన్‌ విశ్వసనీయతను దెబ్బతీసిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మోడీ మాయలో పడ్డారని..

మోడీ మాయలో పడ్డారని..

మొత్తంగా జగన్‌ తనంతట తాను మోడీ మాయలో పడిపోయారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారని అంటున్నారు.

శశికళను చూశాక బోధపడిందని..

శశికళను చూశాక బోధపడిందని..

కేంద్రానికి భయపడాల్సిన అవసరం లేదని, వాళ్లకే మన అవసరం ఉంటుందని జగన్ భావిస్తూ వచ్చారని చాలామంది అంటున్నారు. అయితే తమిళనాడులో చిన్నమ్మ శశికళ పరిస్థితి చూసిన తర్వాత ఆయనకు విషయం బోధపడిందని అంటున్నారు. ఏకంగా ఇప్పుడు జగన్ తన కేసుల గురించి ఏకరువు పెట్టుకున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.

జగన్‌కు నష్టమా, రాజకీయంగా దెబ్బతీసిందా?

జగన్‌కు నష్టమా, రాజకీయంగా దెబ్బతీసిందా?

మోడీతో భేటీ అనంతరం జగన్ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. హోదా కోసం ఇప్పుడే రాజీనామాలు ఎందుకని, హోదా కోసం ఒత్తిడి తెస్తే మనకే నష్టమని మాట్లాడుతున్నారు. దీనిని బట్టి చూస్తే జగన్ బీజేపీ వలలో చిక్కుకున్నారని, దీని వల్ల జగన్‌ను బీజేపీ రాజకీయంగా దెబ్బతీసిందని చాలామంది భావిస్తున్నారు.

ఇక అలా జరగదు..!

ఇక అలా జరగదు..!

జగన్ పైకి ప్రత్యేక హోదా విషయంలో రాజీ పడలేదని చెబుతున్నప్పటికీ.. ఆయన ఆ విషయాన్ని ఇక పక్కన పెట్టేసినట్లేనని చాలామంది భావిస్తున్నారు. ఆయన మాటలే అందుకు నిదర్శనం అంటున్నారు. హోదా కోసం రాజీనామాలు పెద్ద విషయం కాదని, ఇప్పుడు కాకుంటే ఆర్నెల్ల తర్వాత చేస్తామని జగన్ చెప్పడం విడ్డూరమంటున్నారు.

English summary
After AIADMK leader Sasikala, Now YSR Congress Party chief YS Jagan in Modi's net.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X