వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్రిగోల్డ్ బాధితుల ర్యాలీ: కలెక్టరేట్ ముట్టడి (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: అగ్రిగోల్డ్ బాధితులు సోమవారం విశాఖలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఆ సంస్ధను నమ్ముకొని లక్షల రూపాయలు డిపాజిట్ చేసి మోసపోయామంటూ విసాఖ, శ్రీకాకుళం, విజయనగరం, ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వేలాది మంది బాధితులు, ఏజెంట్లు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సోమవారం నిరసన తెలిపారు.

ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నష్టపోయిన బాధితులు ఆత్మహత్యలు చేసుకోకముందే న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ సంస్ధను డిమాండ్ చేశారు. అక్కడి నుంచి కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీగా తరలివెళ్లారు.

 అగ్రిగోల్డ్ బాధితుల ర్యాలీ: కలెక్టరేట్ ముట్టడి

అగ్రిగోల్డ్ బాధితుల ర్యాలీ: కలెక్టరేట్ ముట్టడి

తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూ కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు కలెక్టరేట్ గేట్లను మూసివేసి వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, బాధితులకు మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది.

అగ్రిగోల్డ్ బాధితుల ర్యాలీ: కలెక్టరేట్ ముట్టడి

అగ్రిగోల్డ్ బాధితుల ర్యాలీ: కలెక్టరేట్ ముట్టడి

దీంతో వారంతా కలెక్టరేట్ గేట్ ముందు బైఠాయించారు. వీరిక మద్దతు పలికేందుకు వచ్చిన అగ్రిగోల్డ్ సంస్ధ డైరెక్టర్లు కోటేశ్వరరావు, రామ్మోహనరావు, బాలకృష్ణలపై బాధితులు, ఏజెంట్లు తిరగబడ్డారు. నాలుగు నెలలుగా ఫోన్ చేస్తే పట్టించుకోవడం లేదంటూ ఓ బాధితుడు డైరెక్టర్ కోటేశ్వరరావును నిలదీశాడు.

అగ్రిగోల్డ్ బాధితుల ర్యాలీ: కలెక్టరేట్ ముట్టడి

అగ్రిగోల్డ్ బాధితుల ర్యాలీ: కలెక్టరేట్ ముట్టడి

దీనిపై ఆగ్రహించిన డైరెక్టర్ కోటేశ్వరరావు 'నువ్వు నాకు డబ్బు కట్టావా?' అంటూ ప్రశ్నించడంతో బాధితులంతా డైరెక్టర్లపై తిరగ బడ్డారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని బాధితులను చెదరగొట్టారు.

 అగ్రిగోల్డ్ బాధితుల ర్యాలీ: కలెక్టరేట్ ముట్టడి

అగ్రిగోల్డ్ బాధితుల ర్యాలీ: కలెక్టరేట్ ముట్టడి

అనంతరం కొంత మంది బాధితులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

English summary
Scores of AgriGold investors from across north coastal Andhra held a massive rally from Gandhi statue at the GVMC Office to the collectorate on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X