వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిల్పాకు చెక్ చెప్పేందుకు అఖిలప్రియ కొత్త వాదన! జగన్‌కు కూడా..

నంద్యాల టిక్కెట్‌పై మంత్రి భూమా అఖిలప్రియ కొంత మెత్తబడినట్లుగా కనిపిస్తున్నప్పటికీ.. ఇంకా ఆమె తన ప్రయత్నాలు సాగిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

కర్నూలు: నంద్యాల టిక్కెట్‌పై మంత్రి భూమా అఖిలప్రియ కొంత మెత్తబడినట్లుగా కనిపిస్తున్నప్పటికీ.. ఇంకా ఆమె తన ప్రయత్నాలు సాగిస్తున్నారు. భూమా కుటుంబం నుంచి అభ్యర్థిని నిలబెడితే.. ఇటు టిడిపి, అటు ప్రతిపక్ష వైసిపి నుంచి సహకారం ఉంటుందని ఆశిస్తున్నారు.

చెప్పాల్సింది చెప్పాం, చంద్రబాబు ఇష్టం, భూమా ఫ్యామిలీ అడుగుతోంది: శిల్పాచెప్పాల్సింది చెప్పాం, చంద్రబాబు ఇష్టం, భూమా ఫ్యామిలీ అడుగుతోంది: శిల్పా

నంద్యాల ఉప ఎన్నికల్లో తాము తప్పకుండా పోటీ చేస్తామని జగన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, భూమా కుటుంబం మాత్రం పోటీ లేకుండా ఉంటుందని భావిస్తున్నారు.

శోభా నాగిరెడ్డి మృతి చెందితే..

శోభా నాగిరెడ్డి మృతి చెందితే..

గతంలో శోభా నాగిరెడ్డి మృతి చెందినప్పుడు తమ కుటుంబం నుంచి అభ్యర్థి గెలిచేలా టిడిపి ఎవరినీ పోటీకి పెట్టలేదని భూమా కుటుంబం గుర్తు చేస్తోంది. ఇప్పుడు కూడా తన తండ్రి మృతితో ఖాళీ అయిన నంద్యాల నుంచి తమ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారని, టిడిపి నుంచి మరో అభ్యర్థి రావడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.

ఇప్పుడు కొత్త పేరు సరికాదని..

ఇప్పుడు కొత్త పేరు సరికాదని..

శోభా నాగిరెడ్డి మృతి చెందినప్పుడు ఎలాగయితే టిడిపి అభ్యర్థిని నిలబెట్టలేదో... ఇప్పుడు తన తండ్రి భూమా నాగిరెడ్డి మృతి చెందిన కారణంగా మరో అభ్యర్థి పేరు తెరమీదకు రావడం సరికాదని అఖిలప్రియ అంటున్నారు.

జగన్‌పై ఆశలు

జగన్‌పై ఆశలు

అదే సమయంలో తమ కుటుంబం నుంచి పోటీ చేస్తే వైసిపి కూడా ఎవరిని నిలబెట్టవద్దని భూమా కుటుంబం కోరుకుంటోంది. ఈ కొత్త వాదనతో శిల్పా మోహన్ రెడ్డికి చెక్ చెప్పాలని అఖిలప్రియ భావిస్తున్నారు.

చంద్రబాబు నిర్ణయం పైనే ఆధారం

చంద్రబాబు నిర్ణయం పైనే ఆధారం

అంతకుముందు రోజు అఖిలప్రియ మాట్లాడుతూ.. నంద్యాల టిక్కెటు కేటాయింపుపై సీఎం చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.

English summary
Allagadda MLA and Minister Akhila Priya new twist on Nandyal bypoll candidate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X