వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదే జరిగితే అఖిల ఫ్యూచర్ సూపర్: ఆ క్రెడిట్‌తో బూరెల బుట్టలో పడ్డట్లే..

ఈ విషయంలో ఆమె సఫలమైతే రాయలసీమ వాయిస్ వినిపించే బలమైన మహిళా నాయకురాలిగా ఆమె నిలబడవచ్చు.

|
Google Oneindia TeluguNews

కర్నూల్: రాజకీయంలో ఆరి తేరాలంటే ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా సమర్థవంతంగా తట్టుకుని తమ సత్తా ఏంటో నిరూపించుకోగలిగాలి. పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన ఆదిలోనే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే.. వాటిని తట్టుకుని నిలబడటం కష్టమైన విషయమే.

రాటుదేలుతారా? చతికిలపడుతారా?: అఖిలకు రెండే ఆప్షన్స్.. ఉపఎన్నిక సవాల్!రాటుదేలుతారా? చతికిలపడుతారా?: అఖిలకు రెండే ఆప్షన్స్.. ఉపఎన్నిక సవాల్!

కానీ ఒక్కసారి వాటిని అధిగమించగలిగితే గనుక.. రాజకీయంగా మంచి ఇమేజ్ ఏర్పడటం ఖాయం. మంత్రి భూమా అఖిలప్రియ ముంగిట ఇప్పుడీ అవకాశం ఊరిస్తోంది. నంద్యాలలో తమ కుటుంబానికి ఉన్న పట్టును అఖిలప్రియ నిలబెట్టుకోగలిగితే.. పార్టీతో సంబంధం లేకుండా ఆమెకంటూ సొంత ఇమేజ్ ఏర్పడుతుంది. ఆపై పార్టీలోను తనకంటూ ప్రత్యేక ప్రాధాన్యం లభించే అవకాశం లేకపోలేదు.

శిల్పా' ఫోకస్ తగ్గిందా?

శిల్పా' ఫోకస్ తగ్గిందా?

నంద్యాల ఉపఎన్నికలో జరిగిన ప్రచార సరళిని గమనిస్తే.. శిల్పా మోహన్ రెడ్డి కన్నా ఆయన తరుపున వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డే ఎక్కువగా ప్రచారంలో కనిపించారు. నిజానికి ఆ సమయంలో శిల్పా మలేరియాతో బాధపడుతుండటంతో చాలా తక్కువగా మాత్రమే రోడ్ షోలలలో కనిపించారు. మీడియాకు సైతం పెద్దగా ఇంటర్వ్యూలు ఇచ్చే ప్రయత్నమేది చేయలేదు.

సోమవారం నాడు మాత్రమే ఆయన మీడియాలో పెద్దగా ఫోకస్ అయ్యారని చెబుతున్నారు. ఆదివారం ప్రచారంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తిప్పికొట్టారు. తమ సేవా సంస్థలపై బాబు విమర్శలు చేయడాన్ని వారు ఎండగట్టారు.

అఖిల మాత్రం జోరుగా:

అఖిల మాత్రం జోరుగా:

అనుభవరాహిత్యం వెంటాడుతున్నా.. మీడియా ఫోకస్ విషయంలో మాత్రం అఖిలప్రియ ముందున్నారు. టీవీ చానెల్స్ చర్చలు, ఇంటర్వ్యూలు, ప్రచారంలోను ముందుండి నడిపిస్తూ.. అందరిలోను బాగా ఫోకస్ అయ్యారు. పెద్దగా రాజకీయ పాఠాలేమి తెలియనప్పటికీ.. అన్న బ్రహ్మానందరెడ్డిని గెలిపించడానికి బాగానే కష్టపడ్డారన్న పేరు సంపాదించుకున్నారు. ఈ ఎన్నికలో గనుక బ్రహ్మానందరెడ్డి సత్తా చాటితే ఆ క్రెడిట్‌లో ఎక్కువ భాగం అఖిలప్రియ ఖాతాలోకే వెళ్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతన్నాయి.

జగన్‌ను చూసే:

జగన్‌ను చూసే:

వైసీపీకి సంబంధించి శిల్పాకు ఓటేసేవారంతా.. జగన్ ను చూసే ఆయన వైపు మొగ్గుచూపే అవకాశం ఉందంటున్నారు. అటు ప్రచారంలో కానీ టీడీపీని ఎదుర్కోవడంలో గానీ జగనే కర్త కర్మ క్రియ లాగా వ్యవహరించడంతో.. పోలింగ్ బూత్ కు వెళ్లే ఓటరుకు శిల్పా కన్నా జగనే మదిలో మెదులుతారని చెబుతున్నారు. ఒకరకంగా శిల్పా కన్నా జగన్ పైన ఉన్న అభిమానమే ఓటింగ్ విషయంలో పనిచేసే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే లోకల్ అభ్యర్థిగా శిల్పాకు ఉండే ప్లస్ పాయింట్స్ కొట్టిపారేయలేం.

అదే జరిగితే.. అఖిల ఫ్యూచర్ సూపర్:

అదే జరిగితే.. అఖిల ఫ్యూచర్ సూపర్:

ఉపఎన్నికలో కచ్చితంగా నెగ్గడం అఖిలప్రియకు అనివార్యమనే చెప్పాలి. వైసీపీని కాదనుకుని టీడీపీలోకి వచ్చినందుకు.. జనం భూమా కుటుంబం వెంటే ఉన్నారన్న విషయాన్ని ఆమె నిరూపించుకోవాలి. ఈ విషయంలో గనుక ఆమె విఫలమైతే టీడీపీలో భవిష్యత్తు పరిణామాలు ఆమెకు ప్రతికూలంగా మారిపోవడం ఖాయం.

అదే సమయంలో ఉపఎన్నికలో బ్రహ్మానందరెడ్డి గనుక నెగ్గితే.. అఖిలప్రియ హవా మొదలవడం ఖాయమంటున్నారు. ఇదే ఊపుతో ఆమె ప్రభావవంతమైన నాయకురాలిగాను ఎదగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాయలసీమ వాయిస్ వినిపించే బలమైన మహిళా నాయకురాలిగా ఆమె నిలబడవచ్చు. ఒకరకంగా బూరెల బుట్టలో పడ్డట్లే అని చెప్పాలి.

అయితే ఇదంతా నంద్యాల ఉపఎన్నిక ఫలితం మీదే ఆధారపడి ఉంటుది కాబట్టి.. ఓటరు నిర్ణయంపైనే ఆమె ఫ్యూచర్ ఆధారపడి ఉందని చెప్పాలి.

English summary
As Nandyal enters polling on Wednesday, Tourism Minister Bhuma Akhila Priya has spun a googly. She wondered aloud to TD supporters and the media whether the TD opponent was YSRC president, Y.S. Jagan Mohan Reddy or Shilpa Mohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X