వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసిపి నుంచి బయటకు రావడం సంతోషం, నన్నెవరూ అడ్డుకోలేరు: అఖిలప్రియ

తాను పార్టీ మారినందుకు చాలా సంతోషంగా ఉందని టిడిపి నేత, మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. టిడిపిలోకి వచ్చినందున అభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతుందని అన్నారు.

|
Google Oneindia TeluguNews

కర్నూలు: తాను పార్టీ మారినందుకు చాలా సంతోషంగా ఉందని టిడిపి నేత, మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. టిడిపిలోకి వచ్చినందున అభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతుందని అన్నారు. ఆమె 2014లో వైసిపి నుంచి గెలిచారు. ఆ తర్వాత టిడిపిలో చేరి మంత్రి అయ్యారు.

చదవండి: భూమా ఫ్యామిలీతో పోటీ, సర్వేతో టిక్కెట్: శిల్పా

అంతకుముందు కర్నూలులో మినీ మహానాడులో పాల్గొన్నారు. తన తల్లిదండ్రులు చనిపోవడం వల్ల తాను మంత్రినయ్యానని, తనలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి చెయ్యి పట్టుకొని నడిపించారని, ఇప్పుడు కార్యకర్తలు నడిపిస్తున్నారన్నారు.

నేనే కాదు.. అందరూ వారసులే

నేనే కాదు.. అందరూ వారసులే

కాగా, మంగళవారం నంద్యాలలోని పురపాలకన పట్టణ భవనంలో నియోజకవర్గానికి నూతనంగా మంజూరైన రేషన్ కార్డులు, పింఛన్లను అఖిల పంపిణీ మంజూరు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. దివంగత నేత భూమా నాగిరెడ్డికి, తాను, జగత్‌ విఖ్యాత రెడ్డి, నాగమౌనికలే వారసులు కాదని నంద్యాల ప్రజలంతా వారసులేనని అన్నారు.

భూమా ఆలోచన ఎప్పుడు నంద్యాల గురించే

భూమా ఆలోచన ఎప్పుడు నంద్యాల గురించే

నంద్యాల అంటే భూమా నాగిరెడ్డికి ఎంతో అభిమానమని, ఎప్పుడు పట్టణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించే ఆలోచించేవారని అఖిల అన్నారు. ఆరోగ్యం సరిగ్గా లేక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు కూడా నంద్యాల ప్రజల గురించే ఆలోచించేవారన్నారు. అనారోగ్యంగా ఉన్న రాత్రి నిద్ర పోయేవారు కాదన్నారు.

నంద్యాలలో చేసినట్లు ఆళ్లగడ్డలో చేయమని చెప్పేవారు

నంద్యాలలో చేసినట్లు ఆళ్లగడ్డలో చేయమని చెప్పేవారు

నంద్యాలలో మైనార్టీల దీన పరిస్థితులను తనకు వివరించి వారికి మెరుగైన వసతులు కల్పించాలని చెప్పేవారని అఖిలప్రియ అన్నారు. నంద్యాలలో ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించేందుకు సర్వే ఎలా చేసింది, తనకు చెప్పి ఆ విధంగా ఆళ్లగడ్డలో కూడా చేయించి ఇళ్లు కట్టించాలని సూచించేవారన్నారు.

నన్ను సీఎం తప్ప ఎవరూ అడ్డుకోలేరు

నన్ను సీఎం తప్ప ఎవరూ అడ్డుకోలేరు

తన తండ్రి గతంలో 4 వేల పింఛన్లు, రేషన్‌ కార్డులు ఇవ్వడంతో పాటు పేదలకు విందు భోజనం పెట్టి అందజేశారని అఖిలప్రియ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారన్నారు. తనను ఆపే శక్తి ఒక ముఖ్యమంత్రికే ఉందని, ఇంకా ఎవరూ అడ్డుకోలేరన్నారు.

తండ్రి బాటలో..

తండ్రి బాటలో..

నంద్యాలకు రూ.500 కోట్లు నిధులు తెచ్చి భూమా నాగిరెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్నట్లు అఖిల చెప్పారు. ఆమె రేషన్‌ కార్డులు, పింఛన్‌ మంజూరు పత్రాలను, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులందరికీ విందు భోజనం ఏర్పాటు చేసి, తండ్రి బాటలో నడిచారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకుడు భూమా బ్రహ్మనందా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

English summary
Minister Akhila Priya said on Wednesday that she is happy in Telugudesam Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X