నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలకృష్ణ డబ్బులు పంచారు! సిగ్గులేదా?: బాబుపై అంబటి నిప్పులు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు నంద్యాలలో టీడీపీ ఓటమి తప్పదని తెలిసిపోయిందని అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం అంబటి మాట్లాడుతూ.. నిఘా వర్గాల సమాచారంతో బాబుకు వణుకుపుడుతోందన్నారు.

|
Google Oneindia TeluguNews

కర్నూలు: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు నంద్యాలలో టీడీపీ ఓటమి తప్పదని తెలిసిపోయిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం అంబటి మాట్లాడుతూ.. నిఘా వర్గాల సమాచారంతో బాబుకు వణుకుపుడుతోందన్నారు.

షాక్: డబ్బులు పంచుతూ చిక్కిన బాలకృష్ణ, పరిశీలిస్తున్న ఈసీషాక్: డబ్బులు పంచుతూ చిక్కిన బాలకృష్ణ, పరిశీలిస్తున్న ఈసీ

గుడ్డకాల్చి వేస్తున్నారు..

గుడ్డకాల్చి వేస్తున్నారు..

నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలడంతో చంద్రబాబు గుడ్డకాల్చి ఎదుటివారిపై వేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వాడవాడలా టీడీపీ గుండాలు ప్రజలను బెదిరిస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని అంబటి ఆరోపించారు. నంద్యాలలో ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసని అన్నారు.

Recommended Video

Nandyal By Polls : Balakrishna Money Distributing To Voters Viral In Social Media | Oneindia Telugu
బాలకృష్ణ డబ్బులు పంచారు.. సిగ్గులేదా?

బాలకృష్ణ డబ్బులు పంచారు.. సిగ్గులేదా?

మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడ ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. నంద్యాల ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ స్వయంగా డబ్బులు పంచుతూ దొరికిపోయారని అన్నారు. ఇంకా సిగ్గులేకుండా చంద్రబాబు ఎదుటివారిపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

అదే బాబు పన్నాగం..

అదే బాబు పన్నాగం..

తమను బద్నాం చేసే కుట్రలో భాగంగానే చంద్రబాబు నంద్యాల వస్తున్నారని అన్నారు. మూటలు మూటలుగా వందలకోట్లు తెచ్చి అడ్డగోలుగా పంచి ఎన్నికల వాయిదా వేయించాలన్నది చంద్రబాబు పన్నాగమని ఆరోపించారు. అందుకే ప్రచారం పేరుతో నంద్యాలకు చంద్రబాబు వస్తున్నారని అన్నారు.

కుట్రలు చేసినా..

కుట్రలు చేసినా..

చంద్రబాబు, ఆయన అనుచరులు ఎన్ని కుట్రలు చేసినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమని అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. జనసేన పార్టీ తటస్థంగా నంద్యాల ఉప ఎన్నికపై టీడీపీ, వైసీపీలు తమదే గెలుపంటూ ప్రచారం చేసుకుంటున్నాయి.

English summary
YSR Congress Party leader Ambati Rambabu on Friday fired at TDP MLA Balakrishna and Andhra pradesh CM Chandrababu naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X