వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపిని వదిలేయాలి: బిజెపి సభలో 2సార్లు చేదు, అమిత్ షా ఆరా

బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా విజయవాడ కార్యకర్తల మహా సమ్మేళనంలో కమలం పార్టీకి రెండుసార్లు పలువురు షాక్ ఇచ్చారు. సభ అనంతరం అమిత్ షా వాటిపై ఆరా తీశారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా విజయవాడ కార్యకర్తల మహా సమ్మేళనంలో కమలం పార్టీకి రెండుసార్లు పలువురు షాక్ ఇచ్చారు. సభ అనంతరం అమిత్ షా వాటిపై ఆరా తీశారు.

ఈ సభలో కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, సురేష్ ప్రభులు మాట్లాడుతున్న సమయంలో పలువురు టిడిపికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. 'లీవ్ టిడిపి - సేవ్ బిజెపి' అని ప్లకార్డులు ప్రదర్శించారు.

చదవండి: ప్రభాస్‌కు నరేంద్ర మోడీ బంపరాఫర్

అనంతరం అమిత్ షా మాట్లాడుతున్న సమయంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. వర్గీకరణకు మద్దతివ్వాలని డిమాండ్ చేశారు.

ఆ సమయంలో వెంకయ్య నాయుడు లేచి ఆందోళనకారులపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. బిజెపి మద్దతిస్తోందని, ఇది సరికాదని చెప్పారు. చప్పుడు చేయకుండా కూర్చోవాలన్నారు.

అమిత్ షాకు అప్పుడు ఈ ఆందోళనలు అప్పుడు అర్థం కాలేదు. ఆ తర్వాత ఈ ఆందోళనలపై ఆయన ఇతర నేతల నుంచి ఆరా తీశారు.

అమిత్ షాకు పురంధేశ్వరి ట్రాన్సులేషన్

కాగా, బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా బెజవాడ సభలో హిందీలో ప్రసంగించగా మాజీ కేంద్రమంత్రి, బిజెపి మహిళా మోర్చ నాయకురాలు పురందేశ్వరి తెలుగులోకి తర్జుమా చేశారు.

English summary
BJP National president Amit Shah inquiry about protest in BJP Vijayawada meeting on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X