వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ నెత్తిన సున్నం వేసి వస్తున్నారు: ఆనం, 'జపాన్‌కు అమరావతి రెండో ఇల్లు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా టిడిపి నేత ఆనం వివేకానంద రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. వైసిపిని వీడుతున్న ఎమ్మెల్యేలు జగన్ నెత్తిన సున్నం వేసి వస్తున్నారని ఎద్దేవా చేశారు.

జగన్ చేపట్టింది జలదీక్ష కాదని, జలగ దీక్ష అన్నారు. భవిష్యత్తు తెలుగుదేశం పార్టీదేనని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అవకాశమే లేదని, ఎన్ని ధర్నాలు, నిరసనలు చేసినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని పట్టించుకోరని వ్యాఖ్యానించారు.

anam vivekananda reddy

అమరావతిని రెండో ఇల్లుగా చూడాలని చెప్పా: బాబు

ఏపీ రాజధాని అమరావతిని రెండో ఇల్లుగా భావించమని తాను జపాన్ బృందానికి చెప్పానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. చంద్రబాబుతో జపాన్ బృందం సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

అమరావతి నిర్మాణ బాధ్యతలు జపాన్ ప్రభుత్వానివేనని, ఆ దేశానికి మాకీ సంస్థ ఆధ్వర్యంలో నవ్యాంధ్ర రాజధాని భవనాల డిజైన్ జరగనుందన్నారు. డిజైన్ చేసిన మీరే నిర్మాణాల బాధ్యత తీసుకోవాలని జపాన్ బృందానికి బాబు సూచించారు. జపాన్‌కు చెందిన వెయ్యి కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టనున్నాయన్నారు. ఈ ఏడాదిలో 150 జపాన్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెడతాయన్నారు.

English summary
Anam Vivekananda Reddy lashes out at YS Jagan for his attitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X