వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ మారం: ఉద్వేగంగా ఆనం, శ్రీవారి సేవలో అజిత్

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనం వివేకానంద రెడ్డి బుధవారం నాడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాము ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని చెప్పారు. మతతత్వ పార్టీతోనే, స్థానిక పార్టీలోనే తాము చేరేది లేదని ఒకింత ఉద్వేగంతో చెప్పారు. కాగా, ఆనం సోదరులు బీజేపీ, టీడీపీలలో చేరుతారనే ఊహాగానాలు వినిపించాయి.

శ్రీవారిని దర్శించుకున్న తమిళ నటుడు అజిత్‌

తమిళ సినీ నటుడు అజిత్‌ తిరుమల శ్రీవారిని బుధవారం దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన ఆయన బుధవారం ఉదయం విఐపీ విరామ సమయంలో తిరుమలేశుని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు తీర్ధ ప్రసాదాలు, వెంకటేశ్వరుని జ్ఞాపికను ప్రధానం చేశారు.

Anam says they will remain in Congress

ప్రమాద ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు: శిద్ధా

ప్రకాశం జిల్లా చాగల్లు వద్ద దగ్ధమైన ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సును మంత్రి శిద్ధా రాఘవ రావు సహా పలువురు పరిశీలించారు. ఈ సందర్భంగా శిద్ధా మాట్లాడారు. ప్రమాద ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదంపై నెల్లూరు డీటీసీతో విచారణ జరిపిస్తామన్నారు.

గవర్నర్‌ నరసింహన్‌తో సీఎం చంద్రబాబు భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఎంసెట్‌ వివాదంపై చర్చించనున్నారని సమాచారం. ఈ అంశమై గవర్నర్‌తో చర్చించిన తర్వాత పరిష్కారరం లభించనట్లయితే చివరిగా కోర్టును ఆశ్రయించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో ఎంసెట్‌ అంశంతో పాటుగా నాగార్జున సాగర్‌, విద్యుత్‌ వివాదాలపై చంద్రబాబు గవర్నర్‌తో చర్చించారని తెలుస్తోంది.

English summary
Congress senior leader Anam Vivekananda Reddy said that they will remain in Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X