అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంద్రప్రదేశ్ అసెంబ్లీకి ఐదు గేట్లు, బాబు, జగన్ ఇలా, ముందస్తు అనుమతితో ప్రవేశం

ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి.కొత్త అసెంబ్లీ భవనంలో సమావేశాలు ప్రారంభమౌతాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి.కొత్త అసెంబ్లీ భవనంలో సమావేశాలు ప్రారంభమౌతాయి. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు కొత్త అసెంబ్లీ సమావేశాలు కొత్త అసెంబ్లీ భవనంలో ప్రారంభం కానున్నాయి.

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన నాటి నుండి హైద్రాబాద్ లోని అసెంబ్లీ భవనంలోనే ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించారు. అయితే అమరావతి నుండే పాలన సాగించాలని బాబు నిర్ణయం తీసుకొన్నారు.

దరిమిలా అమరావతి నుండే పాలన సాగుతోంది. గత అసెంబ్లీ సమావేశాలను అమరావతి వేదికగానే నిర్వహించాలని భావించినా వసతి లేని కారణంగా హైద్రాబాద్ లోని నిర్వహించారు.

బడ్జెట్ సమావేశాలను అమరావతిలోనే నిర్వహించాలని తాత్కాలికంగా అసెంబ్లీ భవనాన్ని నిర్మించారు. ఈ అసెంబ్లీ సమావేశాలకు హజరయ్యే ఎంఏల్ఏలకు పార్టీ నాయకులకు అమరావతిలో బస ఏర్పాట్లు చేస్తోంది సర్కార్.

నూతన అసెంబ్లీ భవనంలోనే బడ్జెట్ సమావేశాలు

నూతన అసెంబ్లీ భవనంలోనే బడ్జెట్ సమావేశాలు

ఆంద్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు కొత్త అసెంబ్లీ భవనంలో సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి.ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు తొలిసారిగా అమరావతి వేదికగా జరగనున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. శాసనసభ్యులతో పాటు , అసెంబ్లీ సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకొంది ప్రభుత్వం. నూతన అసెంబ్లీ సమావేశ మందిరాన్ని ఈ నెల 2వ, తేదిన ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు.

కొత్త అసెంబ్లీకి ఐదు ద్వారాలు

కొత్త అసెంబ్లీకి ఐదు ద్వారాలు

కొత్త అసెంబ్లీ భవనానికి ఐదు ద్వారాలు ఉంటాయి. అయితే అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్ళిన తర్వాత 9 ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు. ఆయా ద్వారాలను ప్రోటోకాల్ ప్రకారంగా విభజించారు. తమకు కేటాయించిన ద్వారానే అసెంబ్లీకి ప్రవేశించాల్సి ఉంటుంది.సోమవారం ఉదయం 11.06 గంటలకు గవర్నర్ నరసింహన్ అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించనున్నారు.

భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసిన పోలీసులు

భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసిన పోలీసులు

అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకొని భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసింది పోలీసు యంత్రాంగం. అసెంబ్లీ వద్దకు వచ్చే వారికి సరైన సమాచారం ఇచ్చేందుకుగాను సెక్యూరిటీ కంట్రోల్ డెస్క్ ను కూడ ఏర్పాటు చేశారు పోలీసులు. నాలుగో గేట్ సమీపంలోని సెక్యూరిటీ కంట్రోల్ డెస్క్ ను ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ సమస్యలపై ఈ డెస్క్ లో పోలీసు అధికారిని సంప్రదించాలని పోలీసు ఉన్నతాధికరులు ప్రకటించారు.

ముందస్తు అనుమతితో అసెంబ్లీని సందర్శించే అవకాశం

ముందస్తు అనుమతితో అసెంబ్లీని సందర్శించే అవకాశం

విధ్యార్థులు, ఎన్ జి వోలు, మీడియాకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ముందస్తు అనుమతితో వారు అసెంబ్లీని సందర్శించే వీలుందని పోలీసులు తెలిపారు. మీడియా ప్రాంగణంలో ఆయా పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి, ఎంఏల్ఏలు ప్రస్తుతం నిర్మించిన మార్డంలోనే అసెంబ్లీకి చేరుకొంటారని పోలీసులు తెలిపారు. ఐదు ఎకరాల్లో వాహనాల పార్కింగ్ ను ఏర్పాటు చేశఆరు.

ఏ గేటు ఎవరికోసం

ఏ గేటు ఎవరికోసం

మొదటి గేటు ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మెన్ లు అసెంబ్లీలోకి అడుగుపెడతారు. రెండో గేట్ ద్వారా మంత్రులు, ప్రతిపక్ష నాయుడు అసెంబ్లీలోకి ప్రవేశిస్తారు. మూడోగేటు ద్వారా మీడియా ప్రతినిధులు, సందర్శకులు, ఇతర అధికారులు అసెంబ్లీకి రానున్నారు. నాలుగో గేటు ద్వారా ఎంఏల్ఏలు, ఎంఏల్ సిలు అసెంబ్లీలోకి రానున్నారు. ఐదో గేటు ద్వారా సీనియర్ అధికారులు, అసెంబ్లీ సిబ్బంది అసెంబ్లీకి రానున్నారు.

English summary
Andhra pradesh assembly sessions will be start on monday. heavy security for assembely sessions. Governor Narasimhan will be start Andhra pradesh Assembly sessions on monday at 11.06 am.Ap assembly have five gates , all arrangements completed said officers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X