వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధాని పనులు అప్పుడే కాదు, మోడీకి ఆహ్వానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి తెలుగువారు, దేశ ప్రజలు గర్వించాలా ఉండాలని, అలాగే నిర్మిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. జూన్ 6న భూమి పూజ ఉంటుందని, విజయ దశమి నాడు పనులు ప్రారంభిస్తామన్నారు.

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి జూన్‌ ఆరో తేదీన భూమి పూజ చేస్తామని, దీనిని ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్‌గా చేయాలని భావిస్తున్నామని, ఈ నెల 25న కేపిటల్‌ రీజియన్‌ డీటైల్డ్‌ మాస్టర్‌ ప్లాన్‌ను, జూన్‌ మధ్యలో కేపిటల్‌ సిటీ డీటైల్డ్‌ మాస్టర్‌ ప్లాన్‌ను సింగపూర్‌ ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు.

ఆ తర్వాత, విజయ దశమి నాడు రాజధాని పనులు ప్రారంభిస్తామని, అప్పుడు చరిత్రాత్మక కార్యక్రమంగా హంగామా చేస్తామని, అప్పుడు ఆ కార్యక్రమానికి ప్రధాని మోడీని కూడా ఆహ్వానిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

తనతో ఉన్న సత్సంబంధాల కారణంగా రాజధాని నిర్మాణానికి సింగపూర్‌ ప్రభుత్వం ముందుకు వచ్చిందని, ఇప్పుడు జపాన్‌, ఆస్ర్టేలియా కూడా సహకరిస్తామని అంటున్నాయని తెలిపారు. భవన నిర్మాణాల నమూనాలకు సంబంధించి సొంతంగానే ప్రణాళికలను రూపొందించుకుంటామని, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లను మించి అమరావతి ఉంటుందని ధీమాగా చెప్పారు.

రాజధాని పనులు అప్పుడే కాదు, మోడీకి ఆహ్వానం

రాజధాని పనులు అప్పుడే కాదు, మోడీకి ఆహ్వానం

ఈ రాష్ట్రంలో నాకొచ్చినన్ని అవకాశాలు ఏ వ్యక్తికీ రాలేదని, అయినా తానెప్పుడూ సంతృప్తి చెందనని, త్వరలో రాజధాని నిర్మాణంపై బ్లూప్రింట్‌ వస్తుందని చెప్పారు. 21వ శతాబ్దంలో వచ్చే ఏకైకసిటీ అమరావతి ఒక్కటేనని, ఏపీ ప్రజలంతా గర్వంగా చెప్పుకొనేలా అమరావతిని తీర్చిదిద్దుతామన్నారు.

రాజధాని పనులు అప్పుడే కాదు, మోడీకి ఆహ్వానం

రాజధాని పనులు అప్పుడే కాదు, మోడీకి ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన తర్వాత రెండు రాష్ర్టాలుగా విడిపోయినా తెలుగు వారి అభివృద్ధి కోసం కలిసి పని చేద్దామని తెలంగాణ ప్రభుత్వానికి పలుమార్లు పిలుపు ఇచ్చానని తెలిపారు. రాజకీయంగా విభేదించినా రెండు రాష్ర్టాల అభివృద్ధికి పరస్పర సహకారం అవసరమన్నారు.

రాజధాని పనులు అప్పుడే కాదు, మోడీకి ఆహ్వానం

రాజధాని పనులు అప్పుడే కాదు, మోడీకి ఆహ్వానం

గత ప్రభుత్వాల వల్లే హైదరాబాద్‌లో నాలాలు ఆక్రమణలకు గురయ్యాయన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. నాలాలు లేకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు కదా, ధనిక రాష్ట్రమని చెబుతున్న వాళ్లకి డబ్బుకు కొదువేముందని, హైదరాబాద్‌ అభివృద్ధికి నేను ఓ లెగసీ ఇచ్చానని అన్నారు. గుజరాత్‌ తర్వాత రెండో ధనిక రాష్ట్రం తెలంగాణ అని 14వ ఆర్థిక సంఘం సైతం చెప్పిందని గుర్తు చేశారు.

రాజధాని పనులు అప్పుడే కాదు, మోడీకి ఆహ్వానం

రాజధాని పనులు అప్పుడే కాదు, మోడీకి ఆహ్వానం

మన్మోహన్‌సింగ్‌ అమెరికా వెళ్లినప్పుడు అక్కడి ప్రభుత్వం అక్కడి సిటీలు చూపిస్తే మీకే కాదు మాకూ హైదరాబాద్‌ ఉందని గర్వంగా చెప్పారని, ఆ స్థాయిలో హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లానని చెప్పారు. ఆనాడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినందుకు తాను ఇప్పుడు గర్వపడుతున్నానన్నారు. సంకుచిత మనస్తత్వంతో కాకుండా తెలుగు వారంతా బాగుపడతారన్న ఉద్దేశంతోనే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానన్నారు.

English summary
Andhra Pradesh Capital Construction to Begin on Dusara
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X