అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి:ఖరారు కాని ఫైనల్ డిజైన్లు,లోకల్ కల్చర్ తో....

ప్రభుత్వ భవనాల నమూనాల డిజైన్లలో స్వల్పమార్పులను సూచించింది ఎపి ప్రభుత్వం. ఈ మార్పుల ప్రకారంగా డిజైన్లను మార్చనున్నారు. ఫైనల్ డిజైన్ రూపొందించేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించనున్న ప్రభుత్వ భవనాల రీ డిజైన్లపై ఎపి ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేసింది.కొత్త డిజైన్లలో స్వల్పమార్పులను ప్రతిపాదించింది ప్రభుత్వం.

ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల డిజైన్ల తయారీ కోసం మాస్టర్ ఆర్కిటెక్ట్ సంస్థతో ఎపి ప్రభుత్వం చర్చించింది. ఈ మేరకు డిజైన్లలో స్వల్ప మార్పులను ప్రభుత్వం ప్రతిపాదించింది.

ప్రభుత్వ భవనాల డిజైన్ల తయారీ కోసం నార్మన ఫాస్టర్ సంస్థతో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొంది. ఈ నెల 25వ, తేదిలోపుగా డిజైన్లను ఈ సంస్థ ఇవ్వాల్సి ఉంది.

డిజైన్ల ముసాయిదాను ఎపి ప్రభుత్వం పరిశీలించింది. ఈ మేరకు డిజైన్లలో స్వల్ప మార్పులను ప్రతిపాదించింది. ఈ మార్పులకు అనుగుణంగా డిజైన్లను మార్చనున్నారు.

స్వల్ప మార్పులను ప్రతిపాదించిన ప్రభుత్వం

స్వల్ప మార్పులను ప్రతిపాదించిన ప్రభుత్వం

అమరావతిలో నిర్మించనున్న ప్రభుత్వ భనవాల డిజైన్లపై స్వల్ప మార్పులను ఎపి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు ఎపి పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ నేతృత్వంలోని బృందం ఈ మేరకు ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన ఫాస్టర్ సంస్థతో చర్చించారు. ఈ మేరకు రెండు రోజుల క్రితమే నారాయణ నేతృత్వంలోని బృందం ఇంగ్లాండ్ రాజధాని లండన్ వెళ్ళారు.లండన్ లోని ఆర్కిటెక్ట్ సంస్థతో చర్చలు జరిపారు.

ఫైనల్ డిజైన్లు మరింత ఆలస్యం

ఫైనల్ డిజైన్లు మరింత ఆలస్యం

ప్రభుత్వ భవనాల డిజైన్లు వాస్తవానికి ఈ నెల 25వ, తేదికి పూర్తికావాలి డిజైన్ల ముసాయిదాను పరిశీలించేందుకుగాను పురపాలక శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలోని బృందం లండన్ వెళ్ళింది.అయితే ముసాయిదా డిజైన్లను పరిశీలించిన మంత్రి నారాయణ, ఇతర అధికారులు కొన్ని మార్పులను సూచించారు. ఈ మార్పులకు అనుగుణంగా డిజైన్లను చేయాల్సి ఉంది.దీంతో నిర్ణీత కాలవ్యవధి ప్రకారంగా డిజైన్లు ఇచ్చే అవకాశమైతే లేదు.దీంతో డిజైన్లుఇచ్చేందుకు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యమంత్రి ఆమోదించాలి

ముఖ్యమంత్రి ఆమోదించాలి

ప్రభుత్వ భవనాల డిజైన్ల ముసాయిదా పూర్తైతే ఈ డిజైన్లకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదం తెలపాల్సి ఉంది. ఇప్పటికైతే ముసాయిదా డిజైన్లలో స్వల్పమార్పులను మంత్రుల కమిటీ సూచించింది.ఈ కమిటీ సూచనల ప్రకారంగా డిజైన్లలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. మార్పుల ప్రకారంగా డిజైన్లను తయారుచేసి ముఖ్యమంత్రి ఆమోదం కోసం తేవాల్సి ఉంది. ఈ డిజైన్లకు సిఎం చంద్రబాబునాయుడు ఆమోదముద్ర వేసిన తర్వాత పనులు ప్రారంభం కానున్నాయి.

సంస్కృతి, సంప్రదాయాలకుపెద్దపీట

సంస్కృతి, సంప్రదాయాలకుపెద్దపీట

అమరావతి డిజైన్లలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేయనున్నారు. వినూత్నతరహలో డిజైన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటూనే , చరిత్రను కూడ విస్మరించడం లేదు. ఈ డిజైన్లలో ఎపి చరిత్రను ప్రతిబింబించేలా రూపొందిస్తున్నారు.

English summary
andhra pradesh municipal minister narayana satisfy about government buildings draft designs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X