వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ బంద్: మోడీ! ఎందుకిలా చేస్తున్నారో.. బాబు, ఎత్తుకుపైఎత్తు

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా పైన కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఏపీలో పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే వైసిపి అధినేత జగన్ ఆగస్టు 2వ తేదీన రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబుల తీరును ఆయన తప్పుబట్టారు.

మరోవైపు, చంద్రబాబు.. కేంద్రం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, తిరిగి న్యాయం జరగాలంటే అది ప్రజా చైతన్యంతోనే సాధ్యమని, బంద్‌లు చేసి జనజీవనానికి ఇబ్బందులు కలిగించడం సరైన పద్ధతి కాదని చెబుతున్నారు. జగన్ బంద్‌కు కౌంటర్‌గా.. వాటితో లాభం లేదని, ప్రజా చైతన్యం తీసుకు రావాలంటున్నారు.

టిడిపితో సహా అన్ని రాజకీయ పార్టీలు ప్రజలందరితో కలిసి వినూత్నరీతిలో నిరసనలు తెలపడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ఏపీ నష్టపోయిందని, ఇంకా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వంటి వాటితో మనకే నష్టమన్నారు.

జైట్లీ వ్యాఖ్యలతో బాధపడ్డ బాబు, మోడీకి జపాన్ తరహా నిరసన జైట్లీ వ్యాఖ్యలతో బాధపడ్డ బాబు, మోడీకి జపాన్ తరహా నిరసన

కాంగ్రెస్‌, వైసిపిలు కేంద్రంపై పోరాడాల్సింది పోయి బంద్‌లకు పిలుపునిస్తూ ఇక్కడ ఉద్యమాలు చేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్ప ఏ ప్రయోజనం లేదన్నారు. ప్రజలందరితో కలిసి ఒక్కోరోజు ఒక్కో రకంగా వినూత్నరీతిలో సదస్సులు పెట్టుకోవడం, రోడ్లను ఊడ్చడం, దిల్లీలో నిరసనలు తెలపడం ద్వారా ఒత్తిడి పెంచాలని హితవు పలికారు.

కేంద్రం వల్ల జరిగిన పొరపాటును సరిదిద్దాల్సిన బాధ్యత ఇప్పుడున్న వారిపై ఉన్నా, వారు చేయడం లేదన్నారు. తాను ఎన్నోసార్లు వెళ్లి చెప్పినా. ఫలితం లేకపోయిందన్నారు. అందుకే శుక్రవారం మరోసారి గట్టిగా చెప్పానని వెల్లడించారు. కేంద్రం ఎందుకిలా ప్రవర్తిస్తుందో కూడా అర్థం కావడం లేదన్నారు. అయినా తాను వదిలిపెట్టేది లేదన్నారు. దేశంలో ఎవరూ పడనంత ఇబ్బందులు మనం పడ్డామన్నారు.

ఓ వైపు వైసిపి రోడ్డెక్కాలని, మరోవైపు ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలని సీఎం చంద్రబాబు చెబుతున్న నేపథ్యంలో బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. మిత్రపక్షమైన టిడిపి పైన ఆచితూచి వ్యవహరించాలని ఏపీ బీజేపీ నిర్ణయించింది. టిడిపి ఎత్తుగడల పైఎత్తు వేయాలని భావిస్తోంది.

కేంద్రం పట్ల చంద్రబాబు ఇక నుంచి ఎలా వ్యవహరిస్తారు? వారి అభిప్రాయులు, వ్యూహాలు ఏమిటి? కేంద్రం నుంచి బయటకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయా? వీటి ద్వారా ముందుకెళ్తామని భావిస్తోంది. అయితే, టిడిపి నేతలు విమర్శలు చేస్తే, ప్రతిగా తగ్గవద్దని నిర్ణయించుకున్నారు.

 జగన్, మోడీ, చంద్రబాబు

జగన్, మోడీ, చంద్రబాబు

ప్రత్యేక హోదా అంశంపై ఏపీలో వైసిపి వేడిని రాజేస్తోంది. జగన్ ఆగస్టు 2వ తేదీన రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌ను సీఎం చంద్రబాబు తప్పుబట్టారు. అయితే, కేంద్రంపై మరోరకంగా నిరసనలు ఉండాలంటున్నారు. చంద్రబాబు వ్యూహాలకు అనుగుణంగా బీజేపీ ముందుకు సాగనుంది.

 జగన్

జగన్

రాష్ట్రాన్ని విభజించినప్పుడు లోకసభలో చోటు చేసుకున్న పరిస్థితులే శుక్రవారం ప్రత్యేక హోదా విషయంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విమర్సించారు.

 జగన్

జగన్

ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ ప్రత్యేక హోదాపై మాట్లాడిన వీడియోను ఆయన శనివారం మీడియా సమావేశంలో విడుదల చేసి చూపించారు. నరేంద్ర మోడీ స్వయంగా ఎన్నికల ప్రచార సభలో ప్రత్యేక హోదా ఇవ్వడమే కాకుండా దాన్ని పదేళ్లకు పొడగిస్తామని చెప్పారని జగన్ గుర్తు చేశారు.

 జగన్

జగన్

దాన్ని మోడీ చెప్పడం, వెంకయ్య నాయుడు తెలుగులోకి అనువాదం చేయడం చూశామని అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మాట మారుస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు కూడా పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని అడిగారని, క్రమంగా ప్రత్యేక హోదా సంజీవని కాదని ప్లేటు మార్చారని ఆయన అన్నారు.

English summary
AP Bandh on August 2: YS Jagan calls upon everyone to rise above politics on Special State status.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X