వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ఎఫెక్ట్: బెల్ట్‌షాపుల మూసివేత, కిడ్నీ బాధితులకు నెలకు రూ.2500 పెన్షన్

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకొంది. మద్యవిధానంపై ఇటీవల కాలంలో ఏపీలో మహిళలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బెల్ట్‌షాపులను మూసివేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకొంది. రోడ్లపై మద్యం

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకొంది. మద్యవిధానంపై ఇటీవల కాలంలో ఏపీలో మహిళలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బెల్ట్‌షాపులను మూసివేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకొంది. రోడ్లపై మద్యం తాగుతూ కన్పిస్తే అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. మరికొన్ని కీలక నిర్ణయాలను ఏపీ మంత్రివర్గం తీసుకొంది. మరోవైపు వైసీపీ ప్లీనరీలో బెల్ట్‌షాపులను ఎత్తివేస్తామని ప్రకటించింది. అంతేకాదు మూడు దశల్లో మద్యనిషేధాన్ని విధిస్తామని ప్రకటించింది.

ఏపీ ప్రభుత్వం ఇటీవల కాలంలో తీసుకొచ్చిన మద్యవిధానం‌పై ఆ రాష్ట్రంలో మహిళలు ఆందోళన చేస్తున్నారు. ఈ విధానం కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. దీన్ని విపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకొంటున్నాయనే అభిప్రాయం అధికారపార్టీ నేతల్లో ఉంది. దీంతో టిడిపి ప్రభుత్వం ఈ విషయంలో రాజకీయంగా నష్టం వాటిల్లకుండా వ్యూహత్మకంగా అడుగులువేస్తోంది.

గ్రామాల్లో ప్రధానంగా మద్యం విక్రయాలకు కేంద్రంగా మారిన బెల్ట్‌షాపులను మూసివేయాలని ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం రాజకీయంగా ఆ పార్టీకి కలిసివస్తోందా లేదా అనేది పక్కనపెడితే ఈ నిర్ణయం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని సర్కార్ భావిస్తోంది.

రోడ్లపై మద్యం తాగితే అరెస్ట్

రోడ్లపై మద్యం తాగితే అరెస్ట్

రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై మద్యం తాగుతూ కన్పిస్తే అరెస్ట్ చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు. మద్యం విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా ఉండేందుకుగాను ఆయన నష్టనివారణ చర్యలను చేపట్టారు. ఈ మేరకు బెల్ట్‌షాపులను ఎత్తివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జాతీయ రహదారులపై ఉన్న మద్యం దుకాణాలను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో మద్యం దుకాణాలు జనావాసాల మద్యకు చేరాయి.దీంతో ఆందోళనలు సాగుతున్నాయి. నెలరోజుల్లో పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని డిజిపి సాంబశివరావును ఆదేశించారు సిఎం.

ఇసుక అక్రమరవాణాపై చర్యలు

ఇసుక అక్రమరవాణాపై చర్యలు

ఇసుక మాఫియాతో సంబంధం ఉన్నవారిని అరెస్ట్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ఇసుక రవాణా ఛార్జీలపై నియంత్రణ ఉండేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకొంది. ఇసుక రవాణాకు కిలోమీటరకు ఒకే రకమైన ధరను ఖరారు చేయాలని నిర్ణయించారు. ప్రతి జిల్లాలో నలుగురితో కమిటీని ఏర్పాటుచేయాలని సిఎం నిర్ణయం తీసుకొన్నారు.ఈ కమిటీలో కలెక్టర్, ఎస్‌పితో పాటు మరో ఇద్దరితో ఈ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

కిడ్నీ బాధితులకు నెలకు రూ.2500 పెన్షన్

కిడ్నీ బాధితులకు నెలకు రూ.2500 పెన్షన్

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై కేబినెట్ సమావేశంలో చర్చించారు. వీరికి ప్రతినెలా రూ2500 పెన్షన్ ఇవ్వాలని కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకొంది. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో కూడ కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి కూడ ఈ పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయం తీసుకొన్నారు. భారత వైద్య పరిశోధన మండలి, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కిడ్నీ వ్యాధులపై పరిశోధనకు శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకొన్నారు. ఉద్దానంలో 7 ఆర్‌ఓ ప్లాంట్లను సెప్టెంబర్ నెలాఖరుకు పూర్తిచేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అయితే ఈ నెలాఖరునాటికి మూడు ప్లాంట్లను పూర్తిచేయాలని సంబందిత శాఖకు ఆదేశాలు జారీచేసింది ప్రభుత్వం.

 కులాలు, మతాల పేరుతో రెచ్చగొడితే అప్రమత్తంగా ఉండాలి

కులాలు, మతాల పేరుతో రెచ్చగొడితే అప్రమత్తంగా ఉండాలి

ఈ నెల 26వ, తేదినుండి పాదయాత్ర చేస్తానని కాపు రిజర్వేషన్ల పోరాటసమితి ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కాపు రిజర్వేషన్ల అంశంపై ఏర్పాటుచేసిన మంజునాథ కమిషన్ త్వరలోనే నివేదికను ఇవ్వాలని కేబినేట్ అభిప్రాయపడింది.ఈ మేరకు లా కమిషన్ ద్వారా కమిషన్‌కు లేఖ రాయాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకొన్నారు. మంజునాథ కమిషన్, ముద్రగడ పాదయాత్రపై కూడ చర్చకు వచ్చినట్టు సమాచారం.అయితే ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని కులాలు, ప్రాంతాల పేరుతో ఎవరైనా రెచ్చగొడితే అప్రమత్తంగా ఉండాలని కేబినెట్ ప్రజలను కోరింది. ఏపీ స్టేట్ వాటర్ కార్పోరేషన్ ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకొన్నారు. 2014కు ముందు ఇళ్లు మంజూరై వివిద కారణాలతో పూర్తికాని ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు రూ.500 కోట్లను కేటాయించింది.

English summary
Andhra pradesh Chief Minister ordered to officers shut off belt shops in the state. Cm given to Dgp 1 month time for shut off beltshops.AP cabinet meeting held at Amaravati on Tuesday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X