విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రుడై పుట్టడం జన్మలఫలం, బాబు హ్యాపీ(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ప్రపంచశ్రేణి నగరంగా ఉంటుందని, ఆంధ్రుడై పుట్టడం, ఆంధ్ర భాష మాట్లాడటం అనేది మహా తపస్సుకు లభించిన ఫలమని ప్రముఖ కవీశ్వరుడు అన్న మాటలు నేడు అక్షర సత్యాలుగా కనిపిస్తున్నాయని గవర్నర్ నరసింహన్ అన్నారు.

సోమవారం నాడు విజయవాడలో జరిగిన గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం ఆయన తన ప్రసంగాన్ని తెలుగులో ఆరంభించి చివరలో అందరికీ మరోమారు శుభాభివందనములు అంటూ గవర్నర్ ముగించారు.

ఉదయం 8.22 నిముషాలకు ప్రారంభమైన ఆయన ప్రసంగం 8.52 నిముషాల వరకు సాగింది. ఉదయం 9.15 నిముషాల వరకు ఆయన సభా ప్రాంగణంలో ఉండాల్సి ఉండగా తెలంగాణలో వేడుకల్లో పాల్గొనేందుకు గాను ఆయన ప్రసంగాన్ని శరవేగంతో ముగించి 8.50 నిముషాలకే ప్రాంగణం వదిలి వెళ్లారు.

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం

ఆంధ్రుడై పుట్టడం, ఆంధ్ర భాష మాట్లాడటం అనేది మహా తపస్సుకు లభించిన ఫలం అని ప్రముఖ కవీశ్వరుడు అన్న మాటలు నేడు అక్షర సత్యాలుగా కనిపిస్తున్నాయని రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు.

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం

విజయవాడలో జరిగిన గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం ఆయన తన ప్రసంగాన్ని తెలుగులో ఆరంభించి చివరలో అందరికీ మరోమారు శుభాభివందనములు అంటూ ముగించారు.

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం

ఉదయం 8.22 నిముషాలకు ప్రారంభమైన ఆయన ప్రసంగం 8.52 నిముషాల వరకు సాగింది. ఉదయం 9.15 నిముషాల వరకు ఆయన సభా ప్రాంగణంలో ఉండాల్సి ఉండగా తెలంగాణలో వేడుకల్లో పాల్గొనేందుకు గాను ఆయన ప్రసంగాన్ని శరవేగంతో ముగించి 8.50 నిముషాలకే ప్రాంగణం వదిలి వెళ్లారు.

 గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం

గత ఏడు మాసాల్లోనే తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి కోసం ఎన్నో అద్భుతాలు సృష్టించిందంటూ ముఖ్యమంత్రిని పరోక్షంగా ప్రశంసలతో ముంచెత్తుతూనే ఆసాంతం అడుగడుగునా మా ప్రభుత్వం, మా ప్రభుత్వం అంటూ ప్రస్తావిస్తుండగా పక్కనే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గ సభ్యులు ఎంతో ఉత్సాహంగా ఆయనవైపు తిరిగి ఆనందించారు.

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం

ఆంధ్రత్వం ఆంధ్ర భాషా చన అల్పస్య తపసః ఫలం అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. నేడు భారతీయులందరికీ గొప్ప పండుగరోజన్నారు.

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం

కృష్ణాజిల్లా వాసి పింగళి వెంకయ్య మహాత్ముని కోరిక మేరకు జాతీయ జెండాను రూపొందించి జాతికి అంకితమిచ్చారని అలాంటి జెండాను రూపొందించిన ఈ గడ్డపై నేడు అదే పతాకాన్ని తాను ఆవిష్కరిస్తుండటం తనకెంతో ఆనందంగా ఉందన్నారు.

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం

ఎందరో మహనీయుల త్యాగఫలంగా మనమందరం నేడు ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నామని నరసింహన్ అన్నారు.

 గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం

ప్రసంగం ముగింపులో మళ్లీ తెలుగులో మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర పోరాటంలోను, ఆ దరిమిలా జాతీయ నిర్మాణ పనుల్లోనూ ఆంధ్రప్రదేశ్ పాత్ర గణనీయమైనదన్నారు.

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం

ఎందరో మహనీయులు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషిచేశారన్నారు. వారందరి ఆశయాల కనుగుణంగా వారి కలలు సాకారమయ్యేలా అందరం కలసిమెలసి సమష్టిగా కృషి చేద్దామన్నారు.

English summary
Governor ESL Narasimhan expressed confidence that the new Capital city of Andhra Pradesh, to be built at Thullur in Guntur District, would be a model for the entire country and perhaps be the best on the planet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X