తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అలిపిరిలో బాంబుదాడిలో నేను బతికిన కారణమిదే: చంద్రబాబు

రాష్ట్రాన్ని అభివృద్ది చేసేందుకే అలిపిరిలో ప్రాణాపాయం నుండి వెంకటేశ్వరస్వామి రక్షించారన్న చంద్రబాబునంద్యాలో అపెరల్ పార్క్ ఏర్పాటుచేసి వెయ్యిమందికి ఉద్యోగాలురాయలసీమ అభివృద్దికి కట్టుబడి ఉన్నానని ప్రక

By Narsimha
|
Google Oneindia TeluguNews

కర్నూల్: అలిపిరిలో మావోయిస్టులు మందుపాతరను పేల్చినప్పుడు తిరుపతి వెంకటేశ్వరస్వామి నాకు ప్రాణబిక్ష పెట్టాడని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. నాకు ప్రాణబిక్షపెట్టి రాష్ట్రాభివృద్ది చేయిస్తున్నాడని చంద్రబాబునాయుడు చెప్పారు.

నేను కూడ రాయలసీమలోనే పుట్టానని చంద్రబాబునాయుడు చెప్పారు. నంద్యాల మార్కెట్ యార్డులో పొదుపుసంఘాల మహిళలతో చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు.

Ap chiefminister Chandrababu naidu visits Kurnool district

నంద్యాలలో అపెరల్ పార్క్‌ ఏర్పాటు చేసి వెయ్యిమందికి ఉద్యోగాలు కల్పించేందుకు అలీప్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొన్న విషయాన్ని బాబు గుర్తుచేశారు. నంద్యాల ఉపఎన్నికల్లో ప్రజల సహకారాన్ని తన జీవితంలో మర్చిపోలేనని చెప్పారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రాయలసీమను అభివృద్ది చేయనున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు. నంద్యాలలో ప్రతి ఒక్కరికీ ఇళ్ళను నిర్మించనున్నట్టు చంద్రబాబు చెప్పారు.

ఎన్నికలను రాజకీయ కోణంలో చూడడం లేదని చంద్రబాబునాయుడు చెప్పారు. అన్ని రిజర్వాయర్లను నింపితే రెండు మూడేళ్ళు కరువు వచ్చినా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని బాబు అభిప్రాయపడ్డారు.అనర్హులకు పెన్షన్లు మంజూరు చేసినట్టు రుజువు చేయాలని చంద్రబాబునాయుడు సవాల్ విసిరారు.

English summary
Ap chiefminister Chandrababunaidu meeting with Dwacra women groups in Nandyal on Tuesday. Ap governament agreement with Alip company to provide one thousand jobs in Aperal park at Nandyal said Chandrababunaidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X